Gujarat Cattle: గుజరాత్‌లోని పశువులకు చర్మవ్యాధి.. టీకా దిశగా ప్రభుత్వం

గుజరాత్‌లోని 13 జిల్లాల్లో 1200కు పైగా పశువులకు లంపి చర్మ వ్యాధి కారణంగా మృతి చెందాయి. ఈ మేరకు అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేతో పాటు చికిత్సకు ముమ్మరం చేసింది. అదే సమయంలో జంతు ప్రదర్శనలకు కూడా నిషేదించామని అధికారులు తెలిపారు.

Gujarat Cattle: గుజరాత్‌లోని పశువులకు చర్మవ్యాధి.. టీకా దిశగా ప్రభుత్వం

Gujarat Cattle: గుజరాత్‌లోని 13 జిల్లాల్లో 1200కు పైగా పశువులకు లంపి చర్మ వ్యాధి కారణంగా మృతి చెందాయి. ఈ మేరకు అలర్ట్ అయిన రాష్ట్ర ప్రభుత్వం సర్వేతో పాటు చికిత్సకు ముమ్మరం చేసింది. అదే సమయంలో జంతు ప్రదర్శనలకు కూడా నిషేదించామని అధికారులు తెలిపారు.

రాష్ట్ర వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ మాట్లాడుతూ శనివారం 1240 పశువులు ఈ వైరస్ కారణంగా చనిపోయాయని, 5పశువుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 33జిల్లాల్లో 17జిల్లాలకు వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపించిందని తెలిపారు. ఇప్పటికే 74లక్షల పశువులకు టీకాలు వేయగలిగామని వెల్లడించారు.

కచ్, జామ్‌నగర్, దేవ్‌భూమి ద్వారక, రాజ్‌కోట్, పోర్‌బందర్, మోర్బీ, సురేంద్రనగర్, అమ్రేలి, భావ్‌నగర్, బోటాడ్, జునాగఢ్, గిర్ సోమనాథ్, బనస్కాంత, పటాన్, సూరత్, ఆరావళి, పంచమహల్ జిల్లాలు ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని ఆయన చెప్పారు. వైరల్ వ్యాప్తిని నియంత్రించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పశువులను జాతరల తరలింపుకు నిషేధిస్తూ జూలై 26న నోటిఫికేషన్‌ను ప్రచురించిందని అధికారిక ప్రకటన తెలిపింది.

Read Also : ‘గే’ ను వివాహం చేసుకున్న గుజరాత్ యువరాజు..!

రాజ్‌కోట్ జిల్లా యంత్రాంగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇతర రాష్ట్రాలు, జిల్లాలు, తాలూకాలు, నగరాల నుండి పశువుల తరలింపును ఆగస్టు 21 వరకు పశువుల వ్యాపారం, జాతరలు నిమిత్తం నిషేధించారు.

కళేబరాలను బహిరంగ ప్రదేశాల్లో వేయడాన్ని కూడా ప్రభుత్వం నిషేధించిందని పేర్కొంది. ప్రభావిత జిల్లాల్లోని 1,746 గ్రామాల్లో 50వేల 328 బాధిత పశువులకు చికిత్స అందించామని మంత్రి తెలిపారు.