IT Raids On Malla Reddy : ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా? అంటూ మంత్రి మల్లారెడ్డిపై సెటైర్ వేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంత్రి మల్లారెడ్డి ఇంటితో పాటు ఆయన కుమారులు,అల్లుడు ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన్ను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. దీనిపై బీజేపీ నేత రఘునందన్ రావు విమర్శించారు.

IT Raids On Malla Reddy : ఐటీ,ఈడీ దాడులు అనగానే గుండె నొప్పి వస్తుందా?: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

Minister Mallareddy's sensational comments on IT raids..BJP MLA Raghunandan Rao countered

IT Raids On Malla Reddy : మంత్రి మల్లారెడ్డి నివాసాలు..కార్యాలయాలతో పాటు ఆయన కుమారులు, అల్లుడు,బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపు 50 బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కోట్ల రూపాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దాడులపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐటీ శాఖ అధికారులపై సంచలన వ్యాఖ్యలు..ఆరోపణలు చేశారు. తన కుమారుడిని కొట్టారని తనపై కక్ష పూరితంగానే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు.

IT Raids In Malla Reddy House: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ సోదాలు.. పెద్ద కుమారుడికి స్వల్ప అస్వస్థత.. అధికారులపై మంత్రి ఆగ్రహం

మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. మల్లారెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని..ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారికి ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. అంతేకాదు ఐటీ, ఈడీ దాడులు అనగానే గుండెనొప్పి వచ్చేస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు.తనపై కక్ష పూరితగా వ్యవహరిస్తు ఐటీ దాడులు చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆరోపణలకు రఘునందన్ రావు ఖండించారు. చట్టం ముందు అందరూ సమానమే అని అన్నారు. నోటీసులు ఇవ్వగానే మల్లారెడ్డి కుమారుడికి గుండె నొప్పి వస్తుందా? ఐటీ సోదాల్లో కక్ష సాధింపు ఉండదని అని ప్రశ్నించారు. మల్లారెడ్డి సంస్థల్లో పని చేసే వారే ఐటీ శాఖకు సమాచారం ఇచ్చారని..వారు ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే సెల్ ఫోన్ ను చెత్తబుట్టలో ఎందుకు దాచారు? అంటూ ప్రశ్నించారు.

IT Raids In Malla Reddy House : రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేరుతో మల్లారెడ్డి ఇంటికొచ్చిన ఐటీ అధికారులు .. పక్కా స్కెచ్‌తో దాడులు

కాగా..ఐటీ దాడులు కొనసాగుతున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పిరావడంతో ఆయన్ను సూరారంలోని ఆస్పత్రికి తరలించారు. కొడుకు ఆస్పత్రిలో ఉండటంతో పరామర్శించేందుకు తన నివాసం నుంచి బయలుదేరిన మంత్రి మల్లారెడ్డిని ఐటీ అధికారులు అడ్డుకున్నారు. మల్లారెడ్డి వారిని ఆస్పత్రికి వెళ్లి కొడుకును పరామర్శించి వస్తానని కోరినప్పటికీ అధికారులు అనుమతించలేదు. దీంతో ఐటీ అధికారుల తీరుపై మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని, ఇది రాజకీయ కక్ష సాధింపే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, 200 మంది అధికారులను మా ఇళ్లపైకి పంపి దౌర్జన్యం చేస్తున్నారని మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేమేమైనా దొంగ వ్యాపారం చేస్తున్నామా అంటూ ప్రశ్నించారు. రాతంత్రా నా కుమారుడిని ఇబ్బంది పెట్టారని, నా కుమారుడిని కొట్టినట్లున్నారు, అంతా డ్యామేజ్ చేస్తున్నారంటూ మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.