GVL On Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం-జీవీఎల్ జోస్యం

ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.

GVL On Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం-జీవీఎల్ జోస్యం

Gvl On Draupadi Murmu

GVL On Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయం అని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధీమా వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారి గిరిజన మహిళకు రాష్ట్రపతిగా బీజేపీ అవకాశం కల్పించిందన్నారు. ద్రౌపతి ముర్మును ఎంపిక చేసినందుకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయన్నారు. రాష్ట్రపతి ఎన్నిక చరిత్రాత్మకం కానుందన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ప్రతిపక్షాల తరపున జశ్వంత్ సిన్హాను నిలబెట్టినా.. చాలా పార్టీలు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు ఇవ్వబోతున్నాయని జీవీఎల్ అన్నారు. ద్రౌపది ముర్ము తనకు మద్దతివ్వాలని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. జులై 1 నుంచి ఎన్డీఏ అభ్యర్థి ప్రచారం జరుగుతుందన్నారు. జులై 25న నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపడతారని ఎంపీ జీవీఎల్ అన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిగా ఎంపిక చేయడం హర్షనీయం అన్నారు.

Draupadi Murmu : ఎవరీ ద్రౌపది ముర్ము..? టీచర్ నుంచి రాష్ట్రపతి పోటీ వరకు..ఆదివాసీ మహిళ ప్రస్థానం

రాష్ట్రపతి అభ్యర్థిపై తప్పుడు వ్యాఖ్యలు అభ్యంతరకరం అన్నారు. రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారని చెప్పారు. చీప్ పబ్లిసిటీ కోసం తప్పుడు వ్యాఖ్యలు చేయకూడదని ఎంపీ జీవీఎల్ వర్మకు హితవు పలికారు. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైన హోదా అన్నారు. రాంగోపాల్ వర్మ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మీడియా చర్చలు పెట్టకూడదన్నారు.

presidential election: రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌

దేశవ్యాప్తంగా, దక్షిణాది, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ముర్ముని రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం అవుతోందన్నారు. తెలుగువారు ఉంటే ఇంకా ఆనందపడేవారం అన్నారాయన. రాష్ట్రపతి ఎన్నికను రాజకీయం చేయొద్దని కోరారు. దేశ సమగ్రత, ఐక్యతను ఎవరు ప్రశ్నించలేరని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థికి 55 శాతం మద్దతు ఉందని, ఇది 75 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కరలేదన్నారు ఎంపీ జీవీఎల్. మహారాష్ట్ర పరిణామాలపై స్పందించిన ఎంపీ జీవీఎల్.. అది శివసేన అంతర్గత వ్యవహారం అని కామెంట్ చేశారు. దీనికి, బీజేపీకి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.