Munugode Bypoll Results: గెలుపు దిశగా టీఆర్ఎస్… పార్టీ కార్యకర్తల సంబరాలు షురూ

తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. టీఆర్ఎస్ గెలుపు దిశగా వెళ్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు షురూ చేశారు. మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్స్ చేస్తూ, టీఆర్ఎస్ అనుకూల నినాదాలు చేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం బోసిపోయింది.

Munugode Bypoll Results: గెలుపు దిశగా టీఆర్ఎస్… పార్టీ కార్యకర్తల సంబరాలు షురూ

munugode by-election (1)

Munugode Bypoll Results: తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. టీఆర్ఎస్ గెలుపు దిశగా వెళ్తుంది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాల వద్ద నేతలు, కార్యకర్తలు సంబరాలు షురూ చేశారు. మిఠాయిలు పంచుకుంటూ, డ్యాన్స్ చేస్తూ, టీఆర్ఎస్ అనుకూల నినాదాలు చేస్తూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇవాళ ఉదయం మొదటి 5 రౌండ్ల వరకు టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.

అయితే, అనంతరం మాత్రం అన్ని రౌండ్లలోనూ టీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చింది. ఇప్పటివరకు 11 రౌండ్ల కౌంటింగ్ ముగిసింది. మునుగోడు ఉప ఎన్నికలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 11 రౌండ్లలో కలిపి టీఆర్ఎస్ పార్టీకి 74,594 ఓట్లు, బీజేపీకి 68,800 ఓట్లు పోయ్యాయి. టీఆర్ఎస్ 5,774 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది.

పోటీ మొత్తం టీఆర్ఎస్-బీజేపీ మధ్యే కొనసాగింది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రభావం చూపలేకపోయారు. కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీకి డిపాజిట్ దక్కలేదు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాయి. చివరకు అదే నిజమైంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేయడంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. చివరకు ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు.

బోసిపోయిన బీజేపీ కార్యాలయం
ఈ ఎన్నికలో గెలిస్తే తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో మరింత దూకుడుగా వెళ్లవచ్చని బీజేపీ భావించింది. చివరకు నిరాశే మిగిలింది. దీంతో హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం బోసిపోయింది. మునుగోడు ఉప ఎన్నికలో గెలుపుపై బీజేపీ ఆశలు వదులుకుంది. బీజేపీ కార్యాలయం నుంచి ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, తదితరులు బయటకు వెళ్లిపోయారు. కార్యాలయం వైపు బీజేపీ క్యాడర్, అభిమానులు కనీసం తొంగిచూడడం లేదు. నాలుగు రౌండ్స్ మిగిలుండగానే ఓటమిని అంగీకరించింది బీజేపీ.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..