NEET Exam: రేపు తెలంగాణ‌లో 115 కేంద్రాల్లో నీట్‌ ఎగ్జామ్.. అభ్య‌ర్థులు ఈ నిబంధ‌న‌లు తప్పనిసరిగా పాటించాలి..

వైద్యవిద్యలో (యూజీ) 2022-2023లో ప్రవేశాలకోసం రేపు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో నీట్ ను నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వర్గాలు తెలిపాయి.

NEET Exam: రేపు తెలంగాణ‌లో 115 కేంద్రాల్లో నీట్‌ ఎగ్జామ్.. అభ్య‌ర్థులు ఈ నిబంధ‌న‌లు తప్పనిసరిగా పాటించాలి..

Neet Exam

Updated On : July 16, 2022 / 12:07 PM IST

NEET Exam: వైద్యవిద్యలో (యూజీ) 2022-2023లో ప్రవేశాలకోసం రేపు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 25 పట్టణాల్లోని 115 కేంద్రాల్లో నీట్ ను నిర్వహిస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వర్గాలు తెలిపాయి. తెలంగాణలో సుమారు 60వేల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాయనున్నారు. తెలుగు, హిందీ, ఆంగ్లం సహా ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నీట్ ను రాయొచ్చు.

NEET 2022: నీట్ పరీక్ష వాయిదా లేదు.. రేపే అడ్మిట్ కార్డ్ రిలీజ్

నీట్ పరీక్షలో భాగంగా గతేడాది 200 ప్రశ్నలకు 180 నిమిషాల్లోనే 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి వచ్చేది. కానీ.. ఈ సారి 20 నిమిషాల సమయాన్ని అదనంగా కల్పించారు. మొత్తం 200 ప్రశ్నలకు 200 నిమిషాల సమయాన్ని ఇవ్వగా.. ఇందులో 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానమివ్వాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రశ్నలను క్షుణ్ణంగా చదువుకొని అర్థంచేసుకొని సమాధానం రాసే అవకాశం లభిస్తుంది.

NEET PG 2021: విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారా?: సుప్రీంకోర్టు

ఈ నిబంధనలు తప్పనిసరి..
– నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
– నిర్ణీత సమయం కంటే అరగంట ముందు కేంద్రానికి చేరుకుంటే మేలు.
– నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా వారిని మూడేళ్లు డిబార్ చేయడానికి వీలుంటుంది.
– అభ్యర్థులు నీట్ అడ్మిట్ కార్డు వంటి డాక్యుమెంట్ల పై ఎలాంటి ట్యాంపరింగ్ చేయకూడదు. దరఖాస్తు ఫారం నింపేటప్పుడు, అడ్మిట్ కార్డు పై అతికించే ఫొటోలో ఎలాంటి మార్పులు చేయొద్దు.
– విద్యార్థులు అడ్మిట్ కార్డ్, ఇతర పత్రాలను పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లాలి.
– పాస్ పోర్ట్ సైజు ఫొటో, చెల్లుబాటయ్యే గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి.                                                                                                                                                – పరీక్షా కేంద్రంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి.

– చిన్న హ్యాండ్ శానిటైజర్ ను వెంట ఉంచుకోవచ్చు.
– ఉంగరాలు, బ్రాస్ లైట్లు, చెవిపోగులు, ముక్కు పిన్ లు, గొలుసులు, నెక్లెస్ లు, బ్యాడ్జ్ లు, హెయిర్ పిన్లు, హెయిర్ బ్యాండ్ లు, తాయొత్తులు, గాగుల్స్, హ్యాండ్ బ్యాగులు తదితర ఆభరణాలను ధరించరాదు.
– పరీక్ష రాసే సమయంలో ఏ కారణంతోనూ గదిని వదిలి వెళ్లడానికి అనుమతించరు. కేటాయించిన సమయం ముగిశాక అభ్యర్థులు బయటకు వెళ్లవచ్చు.
– పరీక్ష రాసే కేంద్రంలోనే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను ఇస్తారు.
– అభ్యర్థులు సాధారణ చెప్పులు మాత్రమే ధరించాలి. ఏ తరహా కాగితాలు, కాగితపు ముక్కలు, పెన్నులు, పెన్సిళ్లు, పెన్సిల్ బాక్సు, పర్సు, కాలిక్యులేటర్, స్కేల్, పెన్ డ్రైవ్ లు, రబ్బరు, ఎలక్ట్రానిక్ వస్తువులేవీ వెంట తీసుకెళ్లొద్దు.