Bride Elope: భర్త దగ్గర 10 రూపాయలు తీసుకొని.. ప్రియుడితో నవ వధువు జంప్ .. భర్త ఏం చేశాడంటే ..

పెళ్లి అయిన పదిరోజుల తరువాత వరుడి తల్లిదండ్రులు నూతన జంటను స్థానిక ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ పూజలు అనంతరం భోజనాలు చేస్తున్న సమయంలో వధువు తన భర్త వద్ద 10 రూపాయలు తీసుకొని వాష్ రూంకి వెళ్లింది. ఆమె ఎంతకీ రాకపోవటంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలించారు.. దీంతో అసలు విషయం తెలిసి వరుడు కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.

Bride Elope: భర్త దగ్గర 10 రూపాయలు తీసుకొని.. ప్రియుడితో నవ వధువు జంప్ .. భర్త ఏం చేశాడంటే ..

Bride Elope

Bride Elope: కొత్తగా పెళ్లయిన జంట దైవదర్శనానికి ఆలయానికి వెళ్లింది. పెళ్లి ప్రక్రియ, ఆలయ దర్శనం అంతా సవ్యంగా జరిగింది. దేవాలయానికి వెళ్లిన సమయంలో వీరితో వరుడు తల్లి, తండ్రికూడా ఉన్నారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. వధువు ఆలయ దర్శనం అనంతరం తన భర్త దగ్గర రూ. 10 తీసుకొని వాష్ రూమ్‌కి వెళ్లింది. ఎంతకీ తిరిగిరాకపోవటంతో భర్త, అత్తమామలు ఎంత వెతికినా వధువు ఆచూకీ లభ్యంకాలేదు. చివరికి ఆలయంలో సీసీ టీవీ పుటేజ్‌లను పరిశీలించగా.. భర్త, అత్తమామలు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. తన ప్రియుడితో కలిసి బైక్‌పై వధువు వెళుతున్నట్లు గుర్తించారు.

Indian Bride: పెళ్లి రోజే ప్రాక్టికల్ ఎగ్జామ్.. పెళ్లి దుస్తుల్లోనే పరీక్షకు హాజరైన నవ వధువు.. వైరల్ అవుతున్న వీడియో

యూపీలోని మీర్జాపూర్‌లో జౌన్‌పూర్‌కు చెందిన యువకుడికి ఈనెల 10న అజంగఢ్ కు చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొద్దిరోజులకు.. అంటే ఈనెల 19న వరుడు తల్లి, తండ్రితో కలిసి నూతన వధువు వింధ్వవాసిని ఆలయానికి వెళ్లారు. దర్శనం అనంతరం కుటుంబ సభ్యులు భోజనం చేయడంలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు వరుడి దగ్గర వధువు రూ. 10 తీసుకుంది. వాష్ రూమ్ కు వెళ్లిన వధువు ఎంతకీ కనిపించకపోవటంతో వరుడు, అత్తామామ కంగారు పడ్డారు. గుడి పరిసరాల్లో వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీంతో భర్త వింధ్వాచల్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించాడు.

Nizamabad Bride Suicide Case : నవవధువు ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్.. రవళిని వేధించలేదన్న పెళ్లికొడుకు

నూతన వధువు ఆచూకీని గుర్తించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. దేవాలయంలో సీసీ కెమెరాలను పరిశీలించారు. వధువు ఆలయం నుంచి కాలినడకన బయటకు వెళ్లినట్లు గుర్తించారు. ఆ తరువాత ఓ రెడ్ కలర్ బైక్ పై ప్రియుడితో పరారైనట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులు మాట్లాడుతూ.. తన భార్య తప్పిపోయిందని యువకుడు తమకు తెలపడంతో విచారణ చేపట్టి ఆమె ప్రియుడితో వెళ్లిపోయినట్లు గుర్తించామని అన్నారు. అయితే బాధిత కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.