Medico Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారంటే

ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్.(Medico Preethi)

Medico Preethi : మెడికో ప్రీతి హెల్త్ బులెటిన్ విడుదల.. నిమ్స్ డాక్టర్లు ఏం చెప్పారంటే

Medico Preethi : ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) పీజీ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ప్రీతిని చూసేందుకు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు. ప్రీతి తల్లిదండ్రులతో మంత్రి హరీశ్ మాట్లాడారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి ధైర్యం చెప్పారు మంత్రి హరీశ్ రావు.

అటు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఎక్మో, వెంటిలేటర్, డయాలసిస్ తో మెయింటైన్ చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్. నిపుణుల వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందన్నారు. ప్రీతిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నిమ్స్ సూపరింటెండెంట్.

Also Read..Medico Preethi Case : మెడికో ప్రీతి కేసులో పురోగతి.. 100 పేజీలతో నివేదిక సమర్పించిన కమిటీ

వరంగల్ మెడికో ప్రీతి ఆరోగ్యంపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందన్నారు. ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. గుండె, కిడ్నీ పనితీరులో కాస్త మెరుగుదల కనిపిస్తోందని, డయాలసిస్ కొనసాగుతోందన్నారు. మరోవైపు ఆమె ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదని.. డాక్టర్లు, మంత్రులు కావాలనే తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రీతి కుటుంబసభ్యులు ఆరోపించారు.(Medico Preethi)

అసలేం జరిగిందంటే..
జనగామ జిల్లా గిర్నితండాకు చెందిన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీలో(KMC) పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతోంది. ఆమెను సీనియర్‌ పీజీ విద్యార్థి సైఫ్‌ కొన్నాళ్లుగా వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రీతి తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రీతి తండ్రి నరేందర్.. వరంగల్ జిల్లా మట్టెవాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్‌ మోహన్‌దాసుతో పోలీసులు మాట్లాడారు. తర్వాత ప్రిన్సిపల్‌ సైఫ్‌ను పిలిపించి మందలించారు.

Also Read..Medico Preeti Case: ర్యాగింగ్ కాదు, ఆ కారణం వల్లే ఆత్మహత్యాయత్నం.. వైద్య విద్యార్థి ప్రీతి కేసుపై వరంగల్ సీపీ కీలక విషయాలు

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత అంటే బుధవారం (ఫిబ్రవరి 22న) వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తూ.. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గమనించిన సిబ్బంది.. ఎంజీఎంలోని సీనియర్ డాక్టర్లకు విషయాన్ని తెలియజేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ప్రీతి గుండె ఆగిపోగా.. సీపీఆర్ చేసి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.