Telangana : 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల | notification release 12 mlc seats in telangana

Telangana : 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుదలైంది. నేటి నుంచి (17) నుంచి 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు.

Telangana : 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

Telangana : స్థానిక సంస్థ‌ల కోటాలో 12 ఎమ్మెల్సీ స్థానాల‌కు నోటిఫికేష‌న్ విడుదలైంది. నేటి నుంచి (17) నుంచి 23 వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఈ నెల 24న ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 26 నామినేషన్ ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఈ స్థానాలకు డిసెంబ‌ర్ 10న పోలింగ్, డిసెంబ‌ర్ 14న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

చదవండి : TRS MLC Candidates : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఖాళీ కానున్న ఎమ్మెల్సీలు

ఆదిలాబాద్‌ జిల్లాలో 1, వరంగల్‌ 1, నల్లగొండ 1, మెదక్‌ 1, నిజామాబాద్‌ 1, ఖమ్మం 1, కరీంనగర్‌ 2, మహబూబ్‌నగర్‌ 2, రంగారెడ్డి జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక నిర్వహించనున్నారు. కాగా ఈ స్థానాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం వచ్చే ఏడాది జనవరి 4తో ముగియనుంది.

చదవండి : TRS MLC: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్.. మూడు సీట్లు.. రేసులో నలుగురు!

మరోవైపు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్‌ఎస్‌ పార్టీ ఖరారు చేసింది. ఆ పార్టీ నుంచి పాడి కౌశిక్ రెడ్డి, త‌క్కెళ్ల‌ప‌ల్లి రవీందర్ రావు, మాజీ కలెక్టర్ వెంక‌ట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండ ప్రకాష్ ఈ పోటీలో నిలవనున్నారు.

×