Melody Songs: మళ్ళీ పాత రోజులే.. మెలోడీ మాయలో స్టార్స్!

మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య సినిమాలన్నీ రొమాంటిక్ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్, ఐటమ్ సాంగ్స్

Melody Songs: మళ్ళీ పాత రోజులే.. మెలోడీ మాయలో స్టార్స్!

Melody Songs

Melody Songs: మూవీతో పాటు మ్యూజిక్ సినిమాకి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ అసెట్. అసలు ఆడియన్స్ ని ధియేటర్ల వరకూ తీసుకొచ్చేది ముందుగా పాటలే. ఈమధ్య సినిమాలన్నీ రొమాంటిక్ సాంగ్స్, ఫాస్ట్ బీట్స్, ఐటమ్ సాంగ్స్ తోనే నిండిపోతున్నాయి. అయితే ఈ ఫాస్ట్ బీట్ జమానా లో కూడా మంచి మెలొడీ సాంగ్స్ ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. లేటెస్ట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని మెలొడీ వరల్డ్ లోకి తీసుకెళ్లిన పాటలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

Kacha Badam Song : వామ్మో.. ‘కచ్చా బాదం’ అసలే అమ్మను.. నేను సెలబ్రిటీని.. కనిపిస్తే కిడ్నాప్ చేస్తారేమో..!

ఫాస్ట్ బీట్ సాంగ్స్ తో మోత మోగించేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు మళ్లీ మెలొడీ వైపు మళ్లుతున్నారు. ఆడియన్స్ కి ప్లజెంట్ ఫీల్ ఇచ్చే మెలొడీస్ తో ముందుకొస్తున్నారు. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ఈ రాతలే పాట రాధేశ్యామ్ లాంటి లవ్ రొమాంటిక్ మూవీకి యాప్ట్ అయ్యేలా ట్యూన్ చేశారు. ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ రాధేశ్యామ్ లో అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ మెలొడీ సాంగ్ ఈ రాతలే.. సూదింగ్ మ్యూజిక్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది.

Kalavathi Song: కళావతి పాటికి స్టెప్పులేసిన కీర్తి.. వీడియో వైరల్!

సినిమాలో ఎన్ని పాటలున్నా.. మంచి మ్యూజిక్ మూడ్ ని క్రియేట్ చేసేది మెలొడీ పాటే. మహేష్ బాబు కూడా ఇలాంటి మెస్మరైజింగ్ సాంగ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మహేష్ బాబు, కీర్తిసురేష్ జంటగా పరశురామ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా నుంచి రిలీజ్ అయిన కళావతి సాంగ్.. ఫీల్ గుడ్ మెలొడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో తెరకెక్కిన ఈ పాట.. సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

Lyrical Songs: షేక్ చేస్తోన్న సాంగ్స్.. సోషల్ మీడియాలో రికార్డుల మోత

భాక్సాఫీస్ బద్దలుకొడుతున్న భీమ్లానాయక్ సినిమానుంచి కూడా బ్యూటిఫుల్ మెలొడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈరేంజ్ మెలొడీ సాంగ్ వచ్చి చాలా సంవత్సరాలైంది. అందుకే పవన్, నిత్యా కాంబినేషన్లో వచ్చిన అంత ఇష్టమేంటయ్యా అనే ఫీల్ గుడ్ మెలొడీ సాంగ్ ఫాన్స్ కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ అయ్యిపోయింది.

Heroes Love Songs: యాక్షన్, డ్రామా, థ్రిల్లర్, జానర్ ఏదైనా.. ప్రేమ ఉండాల్సిందే!

సక్సెస్ కోసం తెగ కష్టపడుతున్న శర్వానంద్.. ఈ సారి రిలీజ్ అయ్యే తన సినిమాల్లో అన్ని రకాల ఆడియన్స్ ని ఆకట్టుకోడానికి ప్లాన్ చేశారు. శర్వానంద్, రష్మిక జంటగా రిలీజ్ కి రెడీ అవుతున్న ఆడవాళ్లూ మీకు జోహార్లు సినిమాలో.. హీరోయిన్ ని వర్ణిస్తూ.. లవబుల్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటు అంతే వాల్యుబుల్ లిరిక్స్ తో వచ్చిన ఆసమ్ సాంగ్.. మెలొడీ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.

Kalavathi Lyrical Song: కళ్లా అవి కళావతి.. కల్లోలమైందే నా గతి..! ఒరిజినల్ పాట విడుదల

మెలొడీ సాంగ్స్ పాడటంలో టాప్ లో ఉన్న సింగర్ సిద్ శ్రీరామ్. మోస్ట్లీ సిద్ శ్రీరామ్ పాడిన పాటలన్నీ మెలొడీయిస్ సాంగ్సే. అంతేకాదు ఇప్పటి వరరకూ సిద్ పాడిన మెలొడీ పాటలన్నీ సూపర్ హిట్టే. సినిమా పెద్దగా పరిచయం లేకపోయినా పాటతోనే సినిమాకు కావల్సిన హైప్ తెచ్చిపెడతారు సిద్. లేటెస్ట్ గా షికారు సినిమాలో మనసుదారి మళ్లెనే అనే ఫీల్ గుడ్ మెలొడీని పాడి ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యారు.

NTR Special Song: అంతయు నీవే తారకరామా.. ప్రేక్షకులకు బాలయ్య కృతజ్ఞతలు!

ఫాస్ట్ బీట్ సాంగ్స్ ని ఇష్టపడే తమిళ్ హీరోలు కూడా.. ఈమధ్య మెలొడీ వైపు టర్న్ అయ్యారు. సూర్య, ప్రియాంకా జంటగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈటి సినిమా నుంచి గుండె కరిగెనయ్యో లిరికల్ సాంగ్ రిలీజ్ చేసింది టీమ్. యాంగ్రీ యంగ్ మెన్ గా కనిపించే సూర్య.. డిఫరెంట్ గెటప్స్ లో పాటకు ఫీల్ తెచ్చారు. ఇలా ఎంత మాస్ యాక్షన్ మూవీస్ అయినా, లవ్ స్టోరీ అయినా, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా మెలొడీ సాంగ్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్.