Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..యూపీలో నైట్ కర్ఫ్యూ

కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను

Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..యూపీలో నైట్ కర్ఫ్యూ

Curfew

Night Curfew : కరోనా వైరస్..క్రమంగా కనుమరుగైపోతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” రూపంలో మళ్లీ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. వదల బొమ్మాళీ నిన్ను వదలా అంటూ ప్రపంచదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అసలు ఈ కొత్త వేరియంట్ గురించి ఎవరి దగ్గరా పూర్తి సమాచారం లేదు. అయినప్పటికీ దీనిని కట్టడి చేసేందుకు సాధ్యమైన ప్రయత్నాలన్నింటీని చేస్తున్నాయి ఆయా దేశాలు. దాదాపు 100 దేశాల్లో ఇప్పటికే ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీనికి తీడు గత నాలుగైదు రోజుల నుంచి బ్రిటన్,ఫ్రాన్స్,అమెరికా వంటి కొన్ని దేశాల్లో రోజువారీ కోవిడ్ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోండటం మరింత ఆందోళన కలిగించే విషయం. జనాభా తక్కువ ఉండే దేశాల్లోనే ప్రతి రోజూ లక్షల్లో కోవిడ్ కేసులు నమోదవుతుంటం ఆందోళనకర పరిణామం.

అయితే అటు కోవిడ్,ఇటు ఒమిక్రాన్ ను ఎట్టిపరిస్థితుల్లో నిలువరించేందుకు అన్ని శక్తులను ఒడ్డుతోంది భారత ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా నిలువరించే దిశగా మోదీ సర్కార్ అన్ని చర్యలు చేపడుతోంది. ఇక,ఇప్పటికే పలు రాష్ట్రాలు క్రిస్మస్,న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తుండగా తాజాగా ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ కూడా చేరింది.

ఉత్తరప్రదేశ్ లో డిసెంబర్ 25 నుంచి నైట్ కర్ఫ్యూ అమలుచేయబోతున్నట్లు శుక్రవారం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. రాజధాని లక్నోలో ఇవాళ ఉదయం సీఎం యోగి ఆదిత్యానాధ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా,అవసరమైన కోవిడ్ ప్రొటోకాల్స్ ను పాటిస్తూ..పెళ్లిళ్లు,సామాజిక వేడుకలకు హాజరయ్యేందుకు కేవలం 200 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం సృష్టం చేసింది. వ్యాపారులందరూ తమ తమ సంస్థలు లేదా షాపుల వద్ద “నో మాస్క్ నో గూడ్స్(మాస్కు లేకుంటే సరుకులివ్వం)పాలసీని అమలుచేసేలా చూడాలని అధికారులను కోరారు సీఎం యోగి ఆదిత్యనాథ్. రోడ్లపై లేదా మార్కెట్లలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి తిరగడం తప్పనిసరి అని,ప్రజలు నిబంధనలు పాటిస్తున్నా లేదా అని పరిశీలించేందుకు పోలీసులు నిరంతర పాట్రోలింగ్ నిర్వహించాలని యోగి సర్కార్ జారీ చేసిన ఆర్డర్ లో పేర్కొంది. ఇక,ఉత్తరప్రదేశ్ లో ఇప్పటివరకు రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, వచ్చే కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీజేపీ-ఎస్పీ పార్టీలు వరుస ర్యాలీలు,సభలు నిర్వహిస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రధాని మోదీ అయితే ఇటీవల నెల రోజుల్లో వరుస యూపీ పర్యటనలు చేస్తూ ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శల తూటాలు పేలుస్తున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ కూడా ఎప్పటికప్పుడు బీజేపీ కౌంటర్ ఇస్తూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. అయితే ఎన్నికల నేపథ్యంలో ప్రజలు బహిరంగ ర్యాలీలకు భారీగా హాజరవుతున్న కారణంగా కోవిడ్ కేసులు భారీ పెరిగే అవకాశాలున్న కారణంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు తప్పనిసరి చేస్తోంది యూపీ. రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలను యూపీ సర్కార్ విధించే అవకాశం లేకపోలేదు.

గతేడాది బీహార్ లో కోవిడ్ సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన తర్వాత కోవిడ్ కేసులు ఆ రాష్ట్రంతో పాటు దేశంలోని మిగతా ప్రాంతాల్లో కూడా భారీ నమోదయ్యి సెకండ్ వేవ్ కు దారితీసిన విషయం తెలిసిందే.

ALSO READ 2022 Telugu Films: ఒక్కో హీరో నాలుగైదు సినిమాలు.. ఏడాదంతా జాతరే!