TMC : కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. మమతా బెనర్జీ టీఎంసీకి మంచి రోజులు.. దీదీ ఫుల్ ఖుషీ

కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళం, అసమ్మతి, అంతర్గత విభేదాలు తృణమూల్ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయా? కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో టీఎంసీ బలపడుతోందా? తాజా రాజకీయ..

TMC : కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. మమతా బెనర్జీ టీఎంసీకి మంచి రోజులు.. దీదీ ఫుల్ ఖుషీ

TMC : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళం, అసమ్మతి, అంతర్గత విభేదాలు తృణమూల్ కాంగ్రెస్ కు కలిసి వస్తున్నాయా? కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో టీఎంసీ బలపడుతోందా? తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే, అవుననే సమాధానం వస్తోంది. పలు రాష్ట్రాల్లో టీఎంసీకి ఇది పార్టీ టైమ్ అని చెప్పాలి.

TMC అధినేత్రి మమతా బెనర్జీని పాన్-ఇండియా నాయకురాలిగా, బెంగాల్ శక్తిగానే కాకుండా జాతీయ ఉనికిని కలిగి ఉన్న పార్టీగా టీఎంసీని చూపే ప్రయత్నం జరుగుతోంది. మేఘాలయలో 17 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది కాంగ్రెస్ నుంచి టీఎంసీకి మారడం సంచలనంగా మారింది.

సెప్టెంబర్ లో గోవా మాజీ సీఎం, ఎమ్మెల్యే లూయిజిన్హో ఫలీరో కాంగ్రెస్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. “నేను 40 ఏళ్లగా కాంగ్రెస్‌ వాదిని. కాంగ్రెస్ కుటుంబానికి చెందిన కాంగ్రెస్ వాదిగా కొనసాగుతాను. మొత్తం నాలుగు కాంగ్రెస్‌లలో, మోడీకి గట్టి పోటీ ఇచ్చింది మమత” అని ఆయన అన్నారు. “కాంగ్రెస్ ఇప్పుడు శరద్ పవార్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ మరియు వైఎఆర్ కాంగ్రెస్ మధ్య చీలిపోయింది”. అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ని ఓడించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జాతీయ దృశ్యంలో ఎలా ఉద్భవించారో ఆయన ప్రస్తావించారు. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అసమ్మతి.. బలహీనపడటం టీఎంసీకి కలిసి వస్తోంది. ఆయా రాష్ట్రాల్లో టీఎంసీ క్రమంగా బలపడుతోంది.

వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం తర్వాత ఒక్కసారి పరిస్థితులు మారాయి. టీఎంసీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అనేక మంది నేతలు తిరిగి టీఎంసీ గూటికి చేరారు. ఆగస్టులో సుష్మిత దేవ్ టీఎంసీలో చేరినప్పటి నుంచి ఆ పార్టీ విస్తరణ క్యాంపెయిన్ మొదలైంది.

అసోం..
సుష్మిత దేవ్.. ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ చీఫ్. కాంగ్రెస్ ను వీడి టీఎంసీలో చేరారు. అసోం రాజకీయాల్లో ఆమెది ప్రభావవంతమైన గొంతు. సుష్మిత దేవ్ ని టీఎంసీ రాజ్యసభ్యకు నామినేట్ చేసింది. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ టీమ్ లో చాలా కాలం పాటు ముఖ్యమైన మెంబర్ గా సుష్మిత ఉన్నారు. అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పలువురి పేర్లు ప్రతిపాదించారు. అయితే ఆమె ప్రతిపాదనలను కాంగ్రెస్ హైకమాండ్ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో సుష్మిత కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేశారు.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

ఇక జూలైలో త్రిపుర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కి చెందిన ఏడుగురు సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడి టీఎంసీలో చేరారు. రాజకీయ వ్యూహకర్త, మమతా బెనర్జీ పార్టీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐ-ప్యాక్ గ్రూప్ కి చెందిన 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అది జరిగిన కొన్ని రోజులకే కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ పార్టీని వీడారు.

టీఎంసీలో చేరిన వారిలో మాజీ మంత్రి ప్రకాశ్ చంద్ర దాస్, మాజీ ఎమ్మెల్యే సుబాల్ బౌమిక్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ పన్నా దేబ్, కాంగ్రెస్ మైనార్టీ నేత ఇద్రిస్ మియా ఉన్నారు. అది మొదలు త్రిపురలో కీలక నేతలపై టీఎంసీ ఫోకస్ పెట్టింది. టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అనేకసార్లు త్రిపురలో పర్యటించారు. ఆగస్టులో త్రిపుర యూత్ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ షంతను సాహా టీఎంసీలో చేరారు.

అక్టోబర్ లో మరో భారీ పరిణామం చోటు చేసుకుంది. అధికార బీజేపీకి చెందిన ఎమ్మెల్యే టీఎంసీలో చేరారు. త్రిపుర ర్యాలీలో మాజీ బెంగాల్ మంత్రి రజిబ్ బెనర్జీ బీజేపీ వీడి తన సొంత గూటికి చేరారు. మొత్తంగా త్రిపురలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన 30మంది నాయకులు టీఎంసీలో చేరారు.

గోవాలో పొలిటికల్ కార్నివాల్..
గోవాలో అసలు మనుగడలోనే లేని పార్టీ టీఎంసీ. అలాంటి పార్టీలోకి ఫెలీరో వెళ్లడం అందరిని విస్మయానికి గురి చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు.. టీఎంసీని ప్రధాన పార్టీగా ఆయన మలిచారు. బీజేపీని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో టీఎంసీ చేతులు కలిపింది. ఫెలీరో బాటలో మరికొందరు కాంగ్రెస్ నాయకులు నడిచారు. మరో 9మంది కాంగ్రెస్ ను వీడి టీఎంసీలో చేరారు.

అక్టోబర్ లో మమతా బెనర్జీ గోవాలో పర్యటించారు. ర్యాలీలు నిర్వహించారు. అయితే ఆ పార్టీ అనుకున్నంత మద్దతు లభించ లేదు. కానీ, గోవాకి చెందిన ప్రముఖ వ్యక్తులు టీఎంసీలో చేరారు. అలా టీఎంసీలో చేరిన వారిలో టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్, నటి నఫీసా అలీ, ఎంటర్ ప్రెన్యూర్ మృణాళిని దేశ్ ప్రభు ఉన్నారు. అయితే టీఎంసీకి స్పల్ప ఎదురుదెబ్బ తగిలింది. గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్ దేశాయ్ తన పార్టీని టీఎంసీలో విలీనం చేసేందుకు చివరి నిమిషంలో నో చెప్పారు. అయినప్పటికి గోవా ఫార్వర్డ్ పార్టీలో చీలిక తేవడంలో టీఎంసీ సక్సెస్ అయ్యింది. మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ అధ్యక్షుడు కిరణ్ కందోల్కర్ గత నెలలో టీఎంసీలో చేరారు. ఆయనతోపాటు ఆయన భార్య, 40 మంది స్థానిక నేతలు, కార్యకర్తలు టీఎంసీ కండువా కప్పుకున్నారు.

హర్యానా..
హర్యానాలో కాంగ్రెస్ మాజీ రాష్ట్ర చీఫ్ అశోక్ తన్వార్ ను టీఎంసీ తన పార్టీలోకి లాగేసింది. హర్యానాలో రాహుల్ గాంధీ సన్నిహితుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు మందు ఆయన కాంగ్రెస్ ను వీడారు. హర్యానా కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించిన కొన్ని రోజులకే ఆయన ఆ పార్టీని వీడారు. అశోక్ తన్వర్ పై టీఎంసీ చాలా ఆశలు పెట్టుకుంది. హర్యానాలో టీఎంసీ కేడర్ ను అశోక్ తన్వర్ పటిష్టం చేస్తారని చెబుతోంది.

బీహార్..
అశోక్ తన్వర్ తో పాటు పవన్ వర్మ, కీర్తి ఆజాద్ కూడా టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఆ ఇద్దరు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు. కీర్తి ఆజాద్ మూడు సార్లు లోక్ సభ ఎంపీగా ఉన్నారు. పవన్ వర్మ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. పవన్ వర్మ డిప్లోమాట్ టర్న్డ్ పొలిటీషియన్. అంతేకాదు బీహార్ సీఎం నితీష్ కుమార్ కి సలహాదారుగా పని చేశారు. కీర్తి ఆజాద్ బీహార్ మాజీ సీఎం ఝా ఆజాద్ కొడుకు. క్రికెటర్ టర్న్డ్ పొలిటీషియన్. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో కీర్తి ఆజాద్ ఒకడు.

ఉత్తరప్రదేశ్..
అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నేతలు రాజేశ్ త్రిపాఠి, లలిత్ పాటి త్రిపాఠి టీఎంసీలో చేరారు. సిలిగురిలో మమతా బెనర్జీ సమక్షంలో వారు టీఎంసీ కండువా కప్పుకున్నారు. రాజేశ్ త్రిపాఠి మాజీ ఎమ్మెల్సీ. లలిత్ పాటి త్రిపాఠి మాజీ ఎమ్మెల్యే, యూపీ కాంగ్రెస్ మాజీ వైస్ ప్రెసిడెంట్. ఈ ఇద్దరు యూపీ మాజీ సీఎం కమలా త్రిపాఠి మనవళ్లు.

Red Wine : రెడ్ వైన్ మహిళల్లో మధుమేహం రాకుండా చేస్తుందా?

ఇప్పుడు మేఘాలయ…
ఇప్పుడు మేఘాలయలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ కి చెందిన 17మంది ఎమ్మెల్యేలలో 12మంది టీఎంసీలో చేరిపోయారు. మేఘాలయ మాజీ సీఎం ముకుల్ సంగ్మా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ ను కలిశారు. అది జరిగిన వారం రోజులకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. గోవాలో ఎలాంటి సీన్ అయితే కనిపించిందో ఇప్పుడు మేఘాలయాలోనూ అదే రిపీట్ అయ్యింది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే పార్టీ ఫిరాయించిన నేతలు పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడంతో మెజారిటీ ఎమ్మెల్యేలను కోల్పోయింది.