Pawan Kalyan: పాఠాలు చెబుతున్న భగత్‌సింగ్.. నిజమేనా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో మూడో వారంలోకి అడుగుపెట్టింది.

Pawan Kalyan: పాఠాలు చెబుతున్న భగత్‌సింగ్.. నిజమేనా?

Bhavadeeyudu Bhagat Singh

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌తో మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ చంద్ర తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఢీకొనే పాత్రలో మరో యంగ్ హీరో రానా దగ్గుబాటి పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వీరిద్దరి మధ్య వచ్చిన సీన్స్‌కు థియేటర్లలో ఆడియెన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న పవన్ ఇప్పుడు తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు.

Bheemla Nayak : ‘రాధేశ్యామ్’ రాకతో ‘భీమ్లా నాయక్’కి దెబ్బ.. నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్..

ఈ క్రమంలో పవన్ త్వరలో మరో రీమేక్ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందుగా దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఇప్పుడు మరోసారి ఈ కాంబో సెట్ కావడంతో ఈసారి ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారా అని పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే ఫిలింనగర్ వర్గల్లో ఓ వార్త జోరుగా వినిస్తోంది. ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో పవన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Pawan Kalyan: పవర్ ట్రీట్.. పవన్ బ్యాక్ టూ బ్యాక్ రీమేక్స్

కాగా ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ ప్రొఫెసర్ పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమే అని అందరూ కొట్టిపారేశారు. కానీ ఇప్పుడు ఇదే నిజం అని తెలుస్తోంది. చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ ఓ పవర్ ఫుల్ ప్రొఫెసర్ పాత్రలో మనకు కనిపిస్తాడట. ఇప్పటివరకు పవన్ ఇలాంటి పాత్రలో నటించలేదు. దీంతో పవన్ ఎలాంటి పాఠాలు చెబుతాడా అనే ఆసక్తి అప్పుడే అభిమానుల్లో నెలకొంది.

Pawan Kalyan : యువ క్రికెటర్‌కు పవన్ ఆర్ధిక సహాయం..

ఇక హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. పవన్ సరికొత్త లుక్‌తో ఈ సినిమాలో కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ మూవీలో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరు వినిపిస్తున్నా, ఇంకా అధికారికంగా మాత్రం ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాలేదు. మరి ప్రొఫెసర్ పాత్రలో పవన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో తెలియాలంటే భవదీయుడు భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.