Kerala Water Metro : దేశంలోనే తొలిసారి .. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.

Kerala Water Metro : దేశంలోనే తొలిసారి .. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ

Indias First Water Metro in Kochi

PM Modi Kerala Water Metro  : ప్రధాని మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దేశంలోనే తొలిసారిగా కేరళలో కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీసులు ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళలోని పినరాయి విజయన్ ప్రభుత్వం.

జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే వాటర్ మెట్రో ప్రారంభానికి ముస్తాబు అయ్యింది. ప్రధాని చేతులు మీదుగా ప్రారంభమైంది. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతు ఈ మెట్రో సర్వీసులు ఉంటాయి. 10 దీవులను కలుపుతు 78 విద్యుత్ బోట్లు సర్వీసులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేరళ అంటేనే పర్యాటక ప్రదేశంగా పేరొందింది. అటువంటి కేరళ పర్యాటక రంగానికి ఈ వాటర్ మెట్రో మరింతగా ప్రోత్సమంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ వాటర్ మెట్రో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు.

వాటర్ మెట్రో విశేషాలు ఇలా..
కొచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతూ (వాటర్ మెట్రో) బోట్లు సేవలందిస్తాయి.
ప్రాజెక్టు మొదటిదశలో హైకోర్టు వైపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిలా కక్కనాడ్ టెర్మినల్స్ వరకు సర్వీసులు ఉంటాయి..
కొచ్చి 1 ఐడీ కార్డుతో ఈ వాటర్ మెట్రోలో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది..
డిజిటల్ గానూ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పించింది కొచ్చి వాటర్ మెట్రో..
టికెట్ ధర కనిష్ఠంగా రూ.20, గరిష్ఠంగా రూ.40 గా నిర్ణయించింది. అలాగే వారం, నెల వారీగా పాసులు తీసుకునే వీలు కల్పించింది. ఇవి రూ.180,600,1500 ధరలతో ఉన్నాయి.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా వేగంగా ప్రయాణించేందుకు వాటర్ మెట్రో చక్కటి ప్రయాణంగా మారనుంది..హైకోర్టు టెర్మినల్ నుంచి వైపిన్ టెర్మినల్ కు కేవలం 20 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలోనే చేరుకోవచ్చు. అలాగే వైట్టిల నుంచి వాటర్ మెట్రో ద్వారా 25 నిమిషాల్లో కాకనాడ్ చేరుకోవచ్చని సీఎం పినరాయి విజయన్ తెలిపారు.
10 దీవులు, 15 రూట్లు, 38 టెర్మినల్స్, 78 కిలోమీటర్ల మేర తిరగనున్న 78 ఎలక్ట్రిక్ బోట్లు