Modi-Johnson : మోదీకి ఫోన్ చేసిన బ్రిటన్ ప్రధాని..వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై చర్చ

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఇవాళ ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేసిన మాట్లాడారు. భార‌తీయ కోవిడ్ వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్‌ ను అధికారికంగా గుర్తించేందుకు బ్రిట‌న్ తాజాగా అంగీకరించిన

Modi-Johnson : మోదీకి ఫోన్ చేసిన బ్రిటన్ ప్రధాని..వ్యాక్సిన్ సర్టిఫికెట్ పై చర్చ

Uk India

Modi-Johnson:  బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ ఇవాళ ప్ర‌ధాని మోదీకి ఫోన్ చేసిన మాట్లాడారు. భార‌తీయ కోవిడ్ వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్‌ ను అధికారికంగా గుర్తించేందుకు బ్రిట‌న్ తాజాగా అంగీకరించిన నేప‌థ్యంలో ఈ సంభాష‌ణ జరిగినట్లు తెలుస్తోంది. భార‌తీయ వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్‌ను బ్రిట‌న్ గుర్తించ‌డం సంతోష‌క‌ర‌మ‌ని మోదీ అన్నారు. ఇటీవ‌ల రెండు దేశాల మ‌ధ్య వ్యాక్సిన్ స‌ర్టిఫికేట్ గుర్తించే అంశంలో భేదాభిప్రాయాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

కోవిషీల్డ్ తీసుకున్నా రెండు వారాలు క్వారెంటైన్‌లో ఉండాల‌ని యూకే ఓ నిబంధ‌న పెట్టింది. ఆ నిబంధ‌న‌ను వ్య‌తిరేకించిన భార‌త్‌.. బ్రిట‌న్ పౌరుల‌పై కూడా క్వారెంటైన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేసింది. దీంతో రెండు దేశాల మ‌ధ్య కాస్త ఘ‌ర్ష‌ణ కొన‌సాగిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు దిగొచ్చిన యూకే తాజాగా.. వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ ప్రయాణికులు క్వారంటైన్ లో ఉండకుండా భారతీయ వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను గుర్తించింది.

ఇక..క‌రోనా వైర‌స్,తాలిబన్, ప్రయాణ ఆంక్షలు, వాతావరణ మార్పు లక్ష్యాలు వంటి కీలక విషయాలపై ఇరు దేశాల ప్రధానులు ఇవాళ టెలిఫోన్ సంభాషణలో చర్చించారని బ్రిటన్ ప్రభుత్వ​ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. తాలిబన్ తో సంబంధాల విషయమై అంతర్జాతీయంగా సమన్వయంతో ముందుకుసాగాలని మోదీ, బోరిస్ అభిప్రాయపడ్డారు. అప్ఘానిస్తాన్ లో మానవహక్కులను కాపాడాల్సిన అవశ్యకతను ప్రస్తావించారు. కరోనాపై ఉమ్మడి పోరు, అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభించడం వంటి అంశాలపై మాట్లాడారు. భారత్​-బ్రిటన్​ రోడ్​మ్యాప్​ 2030లోని లక్ష్యాల సాధనలో పురోగతిపై బోరిస్​, మోదీ చర్చించారని ప్రకటనలో తెలిపారు.

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌తో ఫోన్‌లో మాట్లాడిన విష‌యాన్ని ప్ర‌ధాని మోదీ ఇవాళ త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇండియా-యూకే ఎజెండా 2030 గురించి స‌మీక్ష జ‌రిపామ‌ని, గ్లాస్గోలో జ‌ర‌గ‌నున్న వాతావరణ శిఖరాగ్ర సదస్సు కాప్‌-26 నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ మార్పుల గురించి కూడా చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు. అఫ్ఘానిస్తాన్ వంటి ప్రాంతీయ అంశాల గురించి కూడా బోరిస్‌తో మాట్లాడిన‌ట్లు మోదీ త‌న ట్వీట్‌లో తెలిపారు.

ALSO READ Sputnik V : మా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలించారు..! రష్యాపై తీవ్ర ఆరోపణలు