Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ

సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.

Narendra Modi: పార్లమెంట్ భవనంపై జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోదీ

Narendra Modi

Narendra Modi: న్యూ ఢిల్లీలో నూతనంగా నిర్మితమవుతున్న పార్లమెంట్ భవనం పై భాగంలో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

ఈ నిర్మాణానికి ఆధారాన్నిచ్చేందుకు 6,500 కేజీల స్టీల్ వాడారు. దీని నిర్మాణానికి తొమ్మిది నెలల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు. కేంద్రం కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. జాతీయ చిహ్నం ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు. అక్కడి అధికారులు, కూలీలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాని వెంట లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కొందరు ఎంపీలు ఉన్నారు. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ భవనానికి హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేసింది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణం కోసం దాదాపు రూ.971 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ పార్లమెంట్ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలు ఉంటాయి.

AP-JANASENA: వైసీపీ ఎంపీటీసీపై జనసేన భూ కబ్జా ఆరోపణలు.. స్పందించిన ప్రభుత్వం

ఒక ద్వారం రాష్ట్రపతి, ప్రధాన మంత్రి కోసం, రెండో ద్వారం లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీల కోసం కాగా, మూడో ద్వారం సాధారణ ప్రవేశ మార్గంగా ఉంటుంది. నాలుగో ద్వారం కూడా ఎంపీల కోసమే కాగా, ఐదు, ఆరు ద్వారాలు పబ్లిక్ ఎంట్రెన్స్‌లుగా నిర్ణయించారు. ఇది నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతుంది. భూ కంపాలను సైతం తట్టుకునేలా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనిలోపల 120 కార్యాలయాల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. దేశీయంగా ఎక్కువగా నమ్మే వాస్తు ప్రకారం కూడా దీన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భవనాన్ని పురావస్తు సంపదగా గుర్తిస్తారు.