AP-JANASENA: వైసీపీ ఎంపీటీసీపై జనసేన భూ కబ్జా ఆరోపణలు.. స్పందించిన ప్రభుత్వం

‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు. ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది.

AP-JANASENA: వైసీపీ ఎంపీటీసీపై జనసేన భూ కబ్జా ఆరోపణలు.. స్పందించిన ప్రభుత్వం

Ap Janasena

AP-JANASENA: వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారన్న జనసేన పార్టీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం, వైసీపీలు స్పందించాయి. ఈ ఆరోపణల్లో నిజం లేదని వివరణ ఇచ్చాయి. దీనికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రెండో విడత జనవాణి నిర్వహించారు.

Mahua Moitra: కాళీ మాత వివాదం.. మహువా మొయిత్రాపై సొంత పార్టీ నేతల విమర్శలు

ఈ సందర్భంగా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ పరిధిలోని తారకరామ నగర్‌లో వైసీపీ ఎంపీటీసీ భూ కబ్జా చేశారని ఒక కుటుంబం పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ వైసీపీ నేతలు భూ కబ్జాలు చేస్తున్నారని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన చేసిన ఆరోపణలపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై ట్విట్టర్ ద్వారా వివరణ ఇస్తూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ వివాదానికి సంబంధించిన వివరాల ప్రకారం 2004లో అనిత అనే మహిళకు ప్లాట్ నెంబర్ 2400 గల ఇంటిపట్టాను ప్రభుత్వం కేటాయించింది. ఆరు నుంచి 12 నెలల్లో ఇల్లుగానీ, గుడిసెగానీ వేసుకుని స్థలాన్ని స్వాధీనంలో ఉంచుకోవాలని షరతు విధించింది.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

అయితే, 2018 వరకు ఆ ప్రాంతంలో కేటాయించిన 989 ప్లాట్లలో ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారు. లబ్ధిదారుల నుంచి ఎలాంటి అభ్యంతరం రాకపోవడంతో ఆ ప్లాట్లను టీడీపీ ప్రభుత్వం రద్దు చేసింది. రద్దు చేసిన ప్లాట్లలో 2400 నెంబర్ గల అనిత ప్లాట్ కూడా ఉంది. తర్వాత అదే ప్లాటును వి.వెంకటేశ్ అనే వ్యక్తికి ప్రభుత్వం కేటాయిస్తూ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్ జారీ చేసింది. అదే సమయంలో ఒకేసారి మూడు వేల మందికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లు జారీ చేశారు. అంతపెద్ద మొత్తంలో సర్టిఫికెట్లు జారీ చేయడంపై చిత్తూరు కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం దీనిపై విచారణ కొనసాగుతోంది. తర్వాత తనకు కేటాయించిన స్థలంలోనే వెంకటేశ్ షెడ్డు నిర్మించుకుని, ఇంటి పన్ను, కరెంటు బిల్లు చెల్లిస్తున్నాడు.

Salman Khan: కృష్ణజింక కేసులో సల్మాన్‌ను క్షమించం: లారెన్స్ వెల్లడి

షెడ్డు నిర్మించుకునే సమయంలో గతంలో ఆ స్థలం పొంది రద్దైన అనితకు, వెంకటేశ్ మధ్య వివాదం తలెత్తింది. అనిత ఆ స్థలం తనదే అంటూ షెడ్డును ఆక్రమించుకుంది. దీంతో అనితపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు వెంకటేశ్. స్పందించిన పోలీసులు అనిత నుంచి తిరిగి షెడ్డు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైనే అనిత.. తన భూమిని కబ్జా చేశారని పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పవన్ ఆరోపణలు చేశారు. కాగా, వెంకటేశ్‌కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ అనవసర ఆరోపణలు చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.