Manirathnam : పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలి అవుతుందా??

  మణిరత్నం డైరెక్షన్ లో భారీ మల్టీస్టారర్ గా వస్తోన్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తమిళ స్టార్స్ చాలామందితో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్.............

Manirathnam : పొన్నియన్ సెల్వన్ తమిళ బాహుబలి అవుతుందా??

Ponniyan Selvan

Ponniyan Selvan :  మణిరత్నం డైరెక్షన్ లో భారీ మల్టీస్టారర్ గా వస్తోన్న పాన్ ఇండియా మూవీ పొన్నియన్ సెల్వన్. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తమిళ స్టార్స్ చాలామందితో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 30న రిలీజ్ కానుంది. ఈ సోమవారం నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్ రోజుకో క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ సినిమా పైన హైప్ క్రియేట్ చేస్తున్నారు.

చోళ సామ్రాజ్యాధిపతుల విజయాలు, రాచరికపు కుట్రలు, కుతంత్రాలతో కల్కి రాసిన నవల ఆధారంగా రూపొందుతోన్న పీరియాడికల్ థ్రిల్లర్ పొన్నియన్ సెల్వన్. క్రియేటివ్ జీనియస్ మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2 పార్ట్స్ గా వస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ సెప్టంబర్ 30న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన టీమ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరో పక్క ప్రమోషన్స్ పనులూ స్టార్ట్ చేసింది.

Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?

సోమవారం పొన్నియన్ సెల్వన్ 1లో ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య యువరాజు పాత్రను విక్రమ్ పోషిస్తున్నట్టు లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్, మంగళవారం కార్తి లుక్ పోస్టర్ వదిలారు. కార్తి వాంతియా దేవన్ పాత్రలో నటిస్తున్నాడు. బుధవారం నందిని క్యారెక్టర్ లో నటిస్తున్న ఐశ్వర్యా రాయ్ పోస్టర్, గురువారం కుందువై పాత్రలో నటిస్తున్న త్రిష పోస్టర్ రిలీజ్ చేశారు. వీరితో పాటు ఈ సినిమాలో జయం రవి, శోభిత దూళిపాల, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ కి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇండియన్ దర్శక దిగ్గజాల్లో ఒకరైన మణిరత్నం చాలా కాలంగా తన రేంజ్ కి తగ్గ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పుడు భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ & హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా పొన్నియన్ సెల్వన్ రిలీజ్ కాబోతుంది. ఇవాళ జూన్ 8న టీజర్ ని అన్ని భాషల్లో స్టార్ హీరోలతో రిలీజ్ చేయిస్తున్నారు. ఇంత భారీగా సినిమాని తెరకెక్కిస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో బాహుబలి రికార్డులని బద్దలు కొడుతుందని తమిళ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇది తమిళ బాహుబలి అవుతుందని అంటున్నారు. మరి పొన్నియన్ సెల్వన్ ఏ రేజ్ హిట్ కొడుతుందో చూడాలి.