Nijam with Smitha : నా సక్సెస్‌లో సుధీర్ బాబుది ముఖ్య పాత్ర.. పుల్లెల గోపీచంద్!

ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో ఇటీవల మొదలైన కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’. తాజాగా నాలుగో ఎపిసోడ్ గెస్ట్ లుగా ప్రముఖ బ్యాట్‌మెంటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వచ్చారు. వీరిద్దరూ మంచి మిత్రులు అని అందరికి తెలుసు. కానీ వారి స్నేహంలో జరిగిన విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. ఈ షోలో..

Nijam with Smitha : నా సక్సెస్‌లో సుధీర్ బాబుది ముఖ్య పాత్ర.. పుల్లెల గోపీచంద్!

Pullela Gopichand says sudheer babu play crucial role in his success in nijam with smitha talk show

Updated On : March 5, 2023 / 8:32 PM IST

Nijam with Smitha : ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ సోనీ లివ్ తెలుగులో ఇటీవల మొదలైన కొత్త టాక్ షో ‘నిజం విత్ స్మిత’. పాప్ సింగర్ స్మిత ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తుంది. ఈ టాక్ షోలో సరదాగా మాట్లాడి ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడం కాకుండా, సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలు నిలదీసేలా నిజం మాట్లాడుతూ ప్రేక్షకులకు తెలియని విషయాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మూడు ఎపిసోడ్ లు పూర్తి చేసుకోగా.. చంద్రబాబు నాయుడు, చిరంజీవి, రానా, నాని గెస్ట్ లుగా హాజరయ్యారు.

Nijam with Smitha : చిన్నతనంలో ఇంటి నుంచి పారిపోయిన హీరో నాని ఫాదర్.. పట్టించిన అగ్ర నిర్మాత కూతురు!

తాజాగా నాలుగో ఎపిసోడ్ గెస్ట్ లుగా ప్రముఖ బ్యాట్‌మెంటన్ ప్లేయర్ పుల్లేటి గోపీచంద్, టాలీవుడ్ హీరో సుధీర్ బాబు వచ్చారు. వీరిద్దరూ మంచి మిత్రులు అని అందరికి తెలుసు. కానీ వారి స్నేహంలో జరిగిన విషయాలు మాత్రం ఎవరికి తెలియదు. ఈ షోలో ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేశారు ఈ ఇద్దరు మిత్రులు. గోపీచంద్ గురించి సుధీర్ బాబు మాట్లాడుతూ.. ”గోపి దగ్గర షటిల్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవే కాదు. గోపికి షటిల్ కొనివ్వడానికి వాళ్ళ అమ్మ బస్సు ఎక్కకుండా రోజు పనికి కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది” అంటూ తెలియజేశాడు.

ఇక గోపీచంద్ మాట్లాడుతూ.. వరల్డ్ ప్లేయర్స్ తో పోటీ పడాలి అంటే ఆ రేంజ్ ప్లేయర్స్ తో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కానీ నాతో ప్రాక్టీస్ చేయడానికి ఏ దేశ ఆటగాళ్లు ఒప్పుకునేవారు కాదు. దీంతో ప్రాక్టీస్ లో నాకు ఆ రేంజ్ పోటీ ఇవ్వడానికి సుధీర్ తనని తాను ట్రైన్ చేసుకొనే వాడు. నన్ను నేను ఒక ఆటగాడిలా మలుచుకునే ప్రయత్నంలో సుధీర్ బాబుది ముఖ్య పాత్ర అంటూ తెలియజేశాడు. అలాగే ఈ షోలో గోపీచంద్ భార్య ఒక స్పెషల్ వీడియో ద్వారా సుధీర్ అండ్ గోపీచంద్ బాండ్ గురించి తెలియజేసింది. గోపి, సుధీర్ గురించి ఎప్పుడు ఒకటే చెబుతాడు.. గోపికి ఆడాలని అనిపించి, సుధీర్ బాబుని పిలిస్తే. అది ఎర్రని ఎండ కాస్తున్న మధ్యాహనమా? వర్షం పడుతుందా? అని కూడా చూసేవాడు కాదట. గోపి పిలిస్తే సుధీర్ ఏ సమయంలో అయినా అక్కడ ఉండే వాడని చెబుతుంటాడు అంటూ తెలియజేసింది.