Bhagat Singh: పంజాబ్ కొత్త సీఎం కార్యాలయంలో భగత్ సింగ్ ఫోటోపై నెలకొన్న వివాదం

పంజాబ్ సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫోటో వివాదాస్పదానికి దారి తీసింది. ఫొటోలో భగత్ సింగ్ ధరించిన తలపాగా రంగుపై విమర్శలు వచ్చిపడ్డాయి

Bhagat Singh: పంజాబ్ కొత్త సీఎం కార్యాలయంలో భగత్ సింగ్ ఫోటోపై నెలకొన్న వివాదం

Bhagat Singh

Bhagat Singh: పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, షాహీన్ భగత్ సింగ్ ను అమితంగా ఆరాధించే భగవంత్ మాన్..పంజాబ్ లోని భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో తన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆడంభరంగా నిర్వహించారు. తన ప్రమాణస్వీకారం సందర్భంగా భగత్ సింగ్ కు నివాళి అర్పిస్తూ పసుపు తలపాగా ధరించాడు మాన్. తన ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చే ప్రజలు కూడా ‘ బసంతి ‘ (పసుపు) తలపాగాలు ధరించి, పసుపు శాలువాలతో హాజరు కావాలని అభ్యర్థించాడు భగవంత్ మాన్. అంతే కాదు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో తన ఫోటోకి బదులుగా భగత్ సింగ్ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటోలు పెట్టాలని ఆయన కోరారు. ఈక్రమంలో సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ ఫోటో వివాదాస్పదానికి దారి తీసింది. ఫొటోలో భగత్ సింగ్ ధరించిన తలపాగా రంగుపై విమర్శలు వచ్చిపడ్డాయి. అసలు భగత్ సింగ్ బసంతి(పసుపు) రంగు తలపాగా ధరించిన దాఖలాలు లేవంటూ విమర్శకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Uttarakhand CM: ఉత్తరాఖండ్ సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ: సోమావారం బీజేపీ శాసనసభా పక్ష సమావేశం

పసుపు తలపాగా ధరించిన భగత్ సింగ్ ఫోటోకు ప్రామాణికత లేదని విమర్శకులు పేర్కొన్నారు. ఢిల్లీలోని భగత్ సింగ్ రిసోర్స్ సెంటర్‌కి చెందిన రీసెర్చ్ స్కాలర్, గౌరవ సలహాదారు చమన్ లాల్ తెలిపిన వివరాలు మేరకు, “భగత్ సింగ్ కి సంబంధించి అసలైన నాలుగు ఛాయాచిత్రాలు మాత్రమే ఉన్నాయని” “వాటిలో ఎందులోనూ ఆయన పసుపు తలపాగా ధరించినట్లుగా లేదని” లాల్ పేర్కొన్నారు. భగత్ సింగ్ పసుపు లేదా నారింజ రంగు తలపాగాలు ధరించినట్లుగా ఉన్న ఫోటోలు, చేతిలో ఆయుధం ఉన్న ఫోటోలన్ని కొందరు చిత్రకారుల ఊహ నుంచి పుట్టుకొచ్చినవేనని లాల్ పేర్కొన్నారు.

Also Read: Gulam Nabi Azad: 1990 కశ్మీర్‌ నరమేధానికి పాక్ ఉగ్రవాదులే కారణం : ఆజాద్

భగత్ సింగ్ మేనల్లుడు, జగ్మోహన్ సింగ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ కి సంబంధించి నాలుగు అసలైన ఛాయాచిత్రాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయనేది నిజమని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు.. భగత్ సింగ్ తలపాగా రంగుపై కంటే ఆయన ఆశయాలను అమలు చేయడంపై దృష్టి పెట్టాలని జగ్మోహన్ కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ ను దేశ వ్యాప్తంగా యువత ఆదర్శంగా తీసుకుంటారు. విప్లవానికి చిహ్నంగా భగత్ సింగ్ దేశ చరిత్రలో నిలిచిపోయారు.

Also read: Gulam Nabi Azad: 1990 కశ్మీర్‌ నరమేధానికి పాక్ ఉగ్రవాదులే కారణం : ఆజాద్