Agnipath protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల‌ కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం

ఆర్మీలో రిక్రూట్ మెంట్‌కోసం కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఈ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ఈ క్ర‌మంలో ఆందోళ‌న కారులు రైల్వే ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. వీటి విలువ రూ. 259.44 కోట్లని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.

Agnipath protest: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల‌ కారణంగా రైల్వేకు 260 కోట్ల నష్టం

Agnipath

Agnipath protest: ఆర్మీలో రిక్రూట్ మెంట్‌కోసం కేంద్ర ప్ర‌భుత్వం అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి తెచ్చింది. ఈ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొన‌సాగాయి. ఈ ప‌థ‌కానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో భార‌తీయ రైల్వే ఆస్తులు భారీగా ధ్వంస‌మ‌య్యాయి. ఆందోళ‌న కారులు ప‌లు ప్రాంతాల్లో రైళ్ల‌నుసైతం ద‌గ్దం చేశారు. ప‌లు రైల్వే స్టేష‌న్‌ల‌లో రైల్వే ఆస్తుల‌ను ధ్వంసం చేశారు. అయితే రైల్వే ఆస్తుల ధ్వంసం విలువ రూ. 259.44 కోట్ల అని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం రాజ్యసభకు తెలిపారు.

Amazon Prime Day sale : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు.. త్వరపడండి!

ఇటీవల ప్రారంభించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ నిరసనల మధ్య బీహార్ నుండి తెలంగాణ వరకు రైల్వే ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. ఆందోళ‌న కారులు ప‌లు రైళ్ల‌ను తగులబెట్టారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో రైల్వే స్టేష‌న్‌లు అత్యంత దారుణంగా దెబ్బతిన్నాయి. తూర్పు, మధ్య రైల్వే ఆస్తులు నిర‌స‌నకారుల దాడుల్లో ఎక్కువ‌గా ధ్వంస‌మైయ్యాయి.

Agnipath: అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని ఉప‌సంహ‌రించుకునే ప్ర‌సక్తేలేదు: అజిత్ డోభాల్

అయితే శుక్ర‌వారం రాజ్య‌స‌భ‌లో దేశవ్యాప్తంగా అగ్నిపథ్ నిరసనల కారణంగా 2000 రైళ్లకు పైగా దెబ్బతిన్నాయని మంత్రి తెలియజేశారు. జూన్ 15 నుండి జూన్ 23 మధ్య 2132 రైళ్లను రద్దు చేసినట్లు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.