Ramabanam : వివాదంలో రామబాణం సినిమా సాంగ్.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..

తాజాగా రామబాణం సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా అలరించింది.

Ramabanam : వివాదంలో రామబాణం సినిమా సాంగ్.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..

Ramabanam Movie song in copy right issue

Updated On : April 27, 2023 / 11:47 AM IST

Ramabanam :  గోపీచంద్(Gopichand) రామబాణం(Ramabanam) సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. గోపీచంద్, డింపుల్ హయతి(Dimple Hayathi) జంటగా, జగపతి బాబు(Jagapathi Babu), ఖుష్బూ ముఖ్య పాత్రల్లో శ్రీవాస్(Sriwass) దర్శకత్వంలో తెరకెక్కిన రామబాణం సినిమా మే 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజయి ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

తాజాగా రామబాణం సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా అలరించింది. ఇందులో నా ప్రాణం ఆగదే పిల్ల.. అనే లైన్ ఉంది. తాజాగా కరీంనగర్ కు చెందిన గొల్లపల్లి రవీందర్ అనే ఓ గాయకుడు ఈ పాట నాదే, ట్యూన్ నాదే అంటూ మీడియా ముందుకు వచ్చాడు.

గొల్లపల్లి రవీందర్ మీడియాతో మాట్లాడుతూ.. నేను గత 30 ఏళ్లుగా పాటలు పాడుతున్నాను. 1992లో చేతికి గాజులు పిల్లో.. అనే పాట రాశాను, అప్పట్లో ఆ పాట బాగా హిట్ అయింది. ఆ పాటలోని లైన్ ని, నా ట్యూన్ ని రామబాణం యూనిట్ వాళ్ళు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాడుకున్నారు. మూడు రోజుల్లోగా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, చిత్ర యూనిట్ కానీ దీనిపై నాకు వివరణ ఇవ్వాలి లేకపోతే లీగల్ గా వెళ్తాను అని అన్నారు. అలాగే అతను రాసిన పాటను అందరికి మీడియా ముందు వినిపించారు. అప్పటి క్యాసెట్స్ తెచ్చి చూపించారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

NTR – Allu Arjun : పుష్ప 2 సెట్స్ లో ఎన్టీఆర్.. పిక్ వైరల్!

అయితే రవీందర్ రాసిన పాటలోని ఒక్క లైన్ మాత్రమే సినిమా పాటలో ఉంది. ట్యూన్ కూడా కొన్ని చోట్ల మాత్రమే ఒకేలా ఉంది. మరి దీనిపై చిత్రయూనిట్ ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.