Ravichandran Ashwin: ఎప్పుడో రిటైర్ అయిపోదామనుకున్నా – అశ్విన్

టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2018లోనే రిటైర్ అయిపోదామని సీరియస్ గా ఫిక్స్ అయోపోయాడట. ఇంగ్లాండ్ సిరీస్ జరిగిన అనంతరం రిటైర్ అయిపోదామనుకున్నానని ఓవర్ లో ఆరు బంతులు వేసే....

Ravichandran Ashwin: ఎప్పుడో రిటైర్ అయిపోదామనుకున్నా – అశ్విన్

Ashwin

Ravichandran Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2018లోనే రిటైర్ అయిపోదామని సీరియస్ గా ఫిక్స్ అయోపోయాడట. ఇంగ్లాండ్ సిరీస్ జరిగిన అనంతరం రిటైర్ అయిపోదామనుకున్నానని ఒక ఓవర్ లో ఆరు బంతులు వేసేసరికి చాలా అలసిపోయినట్లుగా అనిపించిందని అన్నాడు. అప్పటి నుంచి టెక్నిక్స్ లోమార్పులు చేసుకుని బౌలింగ్ వేయగలుగుతున్నానని అన్నాడు రవి. .

‘2018 నుంచి 2020 మధ్యలో ఆటను వదిలేద్దామనుకున్నా. చాలా కష్టపడుతున్నా కానీ, అనుకున్నది చేయలేకపోతున్నా. ఎంత కఠినంగా ప్రయత్నించినా.. సాధ్యపడటం లేదనుకున్నా. ఏ స్థానంలో దిగినా నిరుత్సాహంగా అనిపించింది. అప్పుడే అడ్జస్ట్ మెంట్లు అవసరమయ్యాయి.

‘మోకాలి నొప్పి లేకపోతే.. సాధ్యమైనంతవరకూ ఎగురుతూనే బౌలింగ్ వేస్తా. అలా చేయనప్పుడు కచ్చితంగా భుజాలు, వెన్ను భాగం నుంచే బలమంతా కూడగట్టుకోవాల్సి ఉంటుంది. నొప్పితో ఆరు బంతులు వేయగానే ఇక చాలానిపించింది. రిటైర్ ఇచ్చేద్దామనునుకున్నా’

………………………………………. : దలైలామాను కలిసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

‘చాలా కారణాలతో రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేశారు. నాకు ఉన్నన్ని గాయాలకు ఎవరు ఇలా కుంగిపోరనిపించింది. చాలా మంది తిరిగి నిలబడుగలుగుతున్నప్పుడు నేనెందుకు కాకూడదనిపించింది. జట్టుకోసం ఆడి చాలా మ్యాచ్ లు గెలిపించా. నాకు సాయం తీసుకోవాలని ఉండదు. ఎక్సిలెంట్ గా ఆడేలా లేను. అందుకు నా భుజం భాగం సన్నగా ఉండాలి. అది కురడం లేదు. ఇప్పుడు అది కాకుండా ఇంకేం చేయాలా అని ఆలోచించా సక్సెస్ అయ్యా’ అని చెప్పాడు.

‘విషయాలన్నీ నా భార్యతోనే పంచుకునే వాడ్ని. నా తండ్రి అవి విని తట్టుకుంటారని అనుకోలేదు. కానీ, నువ్వు వైట్ బాల్ క్రికెట్ లోకి తిరిగి వస్తావని నాకు తెలుసు అంటుండేవారు. చనిపోయేలోపే అది చూస్తా అని చెప్తుండేవారు. అది ఆయనెంతో పర్సనల్ గా ఫీలయ్యేవారని’ అశ్విన్ తన తండ్రి గురించి చెప్పారు.

…………………………….: పాకిస్తాన్‌లో ధ్వంసమైన హిందూ దేవాలయం