Offline Digital Payments : ఆర్బీఐ ట్రయల్ సక్సెస్, నెట్ లేకుండా చెల్లింపులు..ఎలా చేస్తారు ?

ట్ సౌకర్యం లేకుండా..చెల్లింపులు చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ఫలితాలు సక్సెస్ ఫుల్ గా రావడంతో..దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Offline Digital Payments : ఆర్బీఐ ట్రయల్ సక్సెస్, నెట్ లేకుండా చెల్లింపులు..ఎలా చేస్తారు ?

Rbi

RBI Offline Digital Payments: డిజిటల్ లావాదేవీలు ఎక్కువవుతున్నాయి. టీ కొట్టు దగ్గరి నుంచి మొదలుకుని..పెద్ద పెద్ద హోటల్స్ వరకు డిజిటల్ రూపంగా డబ్బులు చెల్లింపులు చేస్తున్నారు. రూ. 5 నుంచి మొదలుకుని వేలు, లక్షల వరకు డిజిటల్ రూపంగా పంపిస్తున్నారు. అయితే..డబ్బులు చెల్లించాలంటే..ఇంటర్నెట్ తప్పకుండా ఉండాల్సిందే. నెట్ సౌకర్యం లేకపోతే…వారి ఇబ్బందులు అంతా ఇంతా కాదు. మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో..డిజిటల్ రూపంలో వారు చెల్లింపులు చేయలేకపోతున్నారు. నెట్ సౌకర్యం ఉన్నా…చెల్లింపులు చేసిన తర్వాత..వ్యాపారికి చేరకపోవడంతో వివాదాలు నెలకొంటున్నాయి. దీనిపై ఆర్బీఐ దృష్టి సారించింది. నెట్ సౌకర్యం లేకుండా..చెల్లింపులు చేసే పద్ధతిని ప్రయోగాత్మకంగా పరిశీలించింది. 2020 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రయోగాత్మంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో దీనిని పరశీలించింది. ఫలితాలు సక్సెస్ ఫుల్ గా రావడంతో..దేశ వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Read More : Aryan Khan : అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ లావాదేవీలు.. ఆర్యన్ డ్రగ్స్ విక్రయిస్తున్నాడా?

మరి చెల్లింపులు ఎలా చేస్తారు ?

ఆఫ్ లైన్ లావాదేవీలను వినియోగించుకోవాలనే వారు…బ్యాంకులు లేదా..ఫిన్ టెక్ సంస్థలు ప్రత్యేక కార్డులు లేకుంటే…టోకెన్లు ఇస్తాయి. నిర్ణీత మొత్తంలో చెల్లించాలని అనుకున్నప్పుడు..ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు. పాయింట్ ఆఫ్ సేల్ (POS) తరహాలో ఉండే ప్రత్యేక యంత్రాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ యంత్రానికి నెట్ అవసరం ఉండదు. ఓటీపీ (OTP), లేదంటే ఎస్ఎంఎస్(SMS) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. వాయిస్ బేస్డ్ చెల్లింపులను ఈ పద్ధతిలో చేయవచ్చు.

Read More : Nifty – Sensex : స్టాక్ మార్కెట్ లో ‘పండుగ’ జోష్

రిస్క్ తక్కువే..కానీ జాగ్రత్తలు అవసరం : –
ఇంటర్నెట్ సౌకర్యం ఉండని గ్రామీణ ప్రాంతాలకు, కొండ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాల్లో అందించేందుకు వీలు ఉంటుంద. ఎన్ఎఫ్ సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) కార్డుల వాడకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఫిన్ టెక్ సంస్థలకు సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించే వీలుంది. కానీ..ఆఫ్ లైన్ కార్డులతో చెల్లింపులు చేయడం రిస్క్ అంతగా ఉండదని..కానీ..కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నరు.