RRR: నైజాంలో రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్

టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల వేటను మొదలుపెట్టింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.....

RRR: నైజాంలో రికార్డుల మోత మోగించిన ఆర్ఆర్ఆర్

RRR

RRR: టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల వేటను మొదలుపెట్టింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందే కళ్లు చెదిరే బిజినెస్ చేసింది. దీంతో ఈ సినిమా రిలీజ్ రోజున ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డుల సునామీని సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు తెలిపారు.

RRR : ఒకప్పుడు తిట్టినోళ్లే ఇప్పుడు పొగుడుతున్నారు.. చరణ్ పై బాలీవుడ్ ప్రశంసలు

అయితే అందరూ అనుకున్నట్లుగానే ఆర్ఆర్ఆర్ చిత్రం రిలీజైన అన్ని ప్రాంతాల్లో కూడా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీస్‌కు చుక్కలు చూపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్రం నైజాం ఏరియాలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.23.3 కోట్ల షేర్ వసూళ్లు సాధించిన తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఇంత భారీ వసూళ్లు తొలిరోజున నైజాం ప్రాంతంలో రాబట్టలేదని వారు అంటున్నారు.

నైజాం ఏరియాలో తొలిరోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇటీవల రిలీజ్ అయిన భీమ్లా నాయక్ రూ.11.85 కోట్లతో మొదటి స్థానంలో నిలవగా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మరే ఇతర సినిమాకు వీలుకాని రీతిలో ఏకంగా రూ.23.3 కోట్లతో అదరగొట్టింది. ఈ రికార్డును బద్దలుకొట్టడం ఇప్పట్లో అసాధ్యమని చిత్ర వర్గాలు అంటున్నాయి.

RRR: KilleRRR అంటూ పుష్పరాజ్ కామెంట్!

ఇక నైజం ఏరియాలో తొలిరోజు షేర్ వసూళ్లు చేసిన టాప్ 10 చిత్రాల జాబితా ఇలా ఉంది…
ఆర్ఆర్ఆర్ – రూ.23.3 కోట్లు
భీమ్లా నాయక్ – రూ.11.85 కోట్లు
పుష్ప: ది రైజ్ – రూ.11.44 కోట్లు
రాధేశ్యామ్ – రూ.10.80 కోట్లు
సాహో – రూ.9.41 కోట్లు
బాహుబలి 2 – రూ.8.9 కోట్లు
వకీల్ సాబ్ – రూ.8.75 కోట్లు
సరిలేరు నీకెవ్వరు – రూ.8.67 కోట్లు
సైరా నరసింహా రెడ్డి – రూ.8.10 కోట్లు
బాహుబలి 1 – రూ.6.32 కోట్లు