RRR Movie: తొలి నుంచి కష్టాలే.. మరోసారి నిరాశ మిగిల్చిన జక్కన్న! పార్ట్-4

ఇలా సినిమా స్టార్ట్ చేసిన అక్షరాలా వెయ్యి రోజులు. ఏదో సంవత్సరంలో సినిమా చేసేద్దామనుకున్న రాజమౌళి మొత్తానికి రెండున్నర సంవత్సరాలు టైమ్ తీసుకుని ట్రిపుల్ ఆర్ ని చెక్కి చెక్కి..

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. మరోసారి నిరాశ మిగిల్చిన జక్కన్న! పార్ట్-4

Rrr Movie (2)

RRR Movie: ఇలా సినిమా స్టార్ట్ చేసిన అక్షరాలా వెయ్యి రోజులు. ఏదో సంవత్సరంలో సినిమా చేసేద్దామనుకున్న రాజమౌళి మొత్తానికి రెండున్నర సంవత్సరాలు టైమ్ తీసుకుని ట్రిపుల్ ఆర్ ని చెక్కి చెక్కి ఇప్పటికి కంప్లీట్ చేశారు. 2018 నవంబర్ లో మొదలైన ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ని ఆగస్ట్ 26 2021లో కంప్లీట్ చేశామని అనౌన్స్ చేశారు రాజమౌళి. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గరనుంచే హై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేసింది.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

హాలీవుడ్, బాలీవుడ్, తోసౌత్ లో స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో.. ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న వాళ్లకి.. ఏ బైక్ షాట్ తో అయితే సినిమా స్టార్ట్ అయ్యిందో.. అదే బైక్ షాట్ తో సినిమా కంప్లీట్ అయ్యిందంటూ.. తెగ ఆనందపడిపోయి ఫాన్స్ తో అప్పట్లో షేర్ చేసుకున్నారు ట్రిపుల్ఆర్ టీమ్. 1000 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న సినిమా ఎప్పుడెప్పుడురిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అందరూ. రకరకాల కారణాలతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనేవస్తోంది. ఇలా సినిమా స్టార్ట్ చేసిన దగ్గరనుంచి సినిమా కష్టాలను ఎదుర్కొని ఫైనల్లీ సంక్రాంతి కి రిలీజ్ అవుతోంది అనుకునే లోపే.. అంతలోనే రిలీజ్ కి బ్రేక్ పడిపోయింది.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. రిస్క్ తీసుకోలేమన్న ట్రిపుల్ఆర్ టీమ్! పార్ట్-2

సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే.. ఆర్ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చెయ్యడం గ్యారంటీ అనుకున్నారు అందరూ. ట్రిపుల్ ఆర్ కి సంబంధించి మేకింగ్ వీడియోలో డీటెయిల్డ్ గా సినిమా గ్రాండియర్ ని చూపించేశారు.  భారీ సెట్స్, భారీ స్టార్ కాస్ట్, వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎంత కష్టపడి సినిమాని తెరకెక్కించారో చూపించారు రాజమౌళి. పర్ ఫెక్షన్ కోసం సెట్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకూ ప్రతీ చిన్న విషయంలో డీటెయిల్డ్ గా దగ్గరుండి చూసుకునే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. రిలీజ్ కు ముందే 2 వేలకోట్ల కలెక్షన్ల లెక్కలు కూడా వేసుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తూ టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాకు ఆ మాత్రం బిజినెస్ జరగకపోతే ఎలా అని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు.

కానీ సీన్ రివర్స్ అయ్యింది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండడంతో పాటు ఆంధ్రలో టికెట్ రేట్ వల్ల బయ్యర్లు వెనకాముందాడుతున్నారు. వీటిని లెక్కచేయకుండా జనవరి 7నే ట్రిపుల్ ఆర్ ను తీసుకొస్తే.. దాదాపు 200 కోట్ల లాస్. అందుకే తప్పని సరి పరిస్తితుల్లో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు ట్రిపుల్ ఆర్ టీమ్. ఇలాఎంతో కష్టపడి 4 ఏళ్ల విజన్ ని తెరమీదకెక్కించిన ట్రిపుల్ఆర్ సినిమా ధియేటర్లోకొచ్చేదెప్పుడా అని అటు ఆడియన్స్ తో పాటు టీమ్ కూడా ఎదురు చూస్తోంది.