RRR Movie: తొలి నుంచి కష్టాలే.. రిస్క్ తీసుకోలేమన్న ట్రిపుల్ఆర్ టీమ్! పార్ట్-2

జనవరి 7న నేషనల్ వైడ్ అన్ని థియేటర్స్ లో ట్రిపుల్ ఆర్ బొమ్మ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. అటు ఓవర్సీస్ లోనూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్స్ లో జక్కన్న సినిమా దిగేలా చూశారు

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. రిస్క్ తీసుకోలేమన్న ట్రిపుల్ఆర్ టీమ్! పార్ట్-2

Rrr Postpone

RRR Movie: జనవరి 7న నేషనల్ వైడ్ అన్ని థియేటర్స్ లో ట్రిపుల్ ఆర్ బొమ్మ మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు. అటు ఓవర్సీస్ లోనూ ఏ ఇండియన్ సినిమా రిలీజ్ కానన్ని థియేటర్స్ లో జక్కన్న సినిమా దిగేలా చూశారు. కానీ ముచ్చటగా మూడో సారి ఆర్ఆర్ఆర్ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది. రిలీజ్ కు మొత్తం రెడీగానే ఉంది కానీ.. రిలీజ్ మాత్రం ఇప్పుడే చెయ్యట్లేదని అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది ట్రిపుల్ ఆర్ టీమ్. ఒక్క వారంలో ఈ పాన్ ఇండియా సినిమాని రిలీజ్ చేస్తున్నామన్న ఆనందం అంతా ఆవిరైపోయింది ట్రిపుల్ఆర్ టీమ్ కి.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

ఎట్టి పరిస్తితుల్లో జనవరి 7న ఆర్ఆర్ ఆఱ్ రిలీజ్ చేస్తామన్న టీమ్.. మాట తిప్పం.. మడమతిప్పం అంటూనే వేరే దారి లేక సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాల్సొచ్చిందని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. రిలీజ్ కి మేం రెడీ అంటూనే.. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అంతగా బాలేక పోవడంతో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నాం అని చావు కబురు చల్లగా చెప్పారు. ప్యాన్ ఇండియా లెవల్లో హాలీవుడ్, బాలీవుడ్, తో సౌత్ టాప్ స్టార్స్ తో దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రిలీజ్ చెయ్యాలంటే రైట్ టైమ్ చూస్కోవాలి కాబట్టే సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామన్నారు మేకర్స్. దాదాపు 50 కోట్లతో ఆల్ ఓవర్ ఇండియా ప్రమోషన్లు చేసిన ట్రిపుల్ఆర్ లాస్ట్ కి ప్రేక్షకుల ముందుకు రాకుండానే ఆగిపోయింది.

RRR Postpone: ఆర్ఆర్ఆర్ వాయిదా వెనుక మేకర్స్ లెక్కలివేనా?

ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరనుంచి.. ఇండియాలో జరిగిన ప్రమోషన్ల క్రేజ్ వరకూ.. అంతా చూస్తే.. సినిమా ఈజీగా రిలీజ్ అయ్యిన రోజే 100 కోట్లకు పైగాకలెక్ట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఆ రేంజ్ లో ప్రమోషన్లు చేశారు. ఎప్పుడూ లేనంతగా బాలీవుడ్ లో విపరీతంగా ప్రమోట్ చేశారు. ఫస్ట్ టైమ్.. చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్ కి టార్గెట్ పెట్టుకోవడంతో.. రాజమౌళి తన మ్యాజిక్ తో సినిమాని అదే రేంజ్ లో ప్రమోషన్లు కూడా చేయించారు. టాప్ నేషనల్ చానల్స్ దగ్గరనుంచి.. లోకల్ యూ ట్యూబ్, వెబ్ సైట్స్ వరకూ దాదాపు అన్ని ఫేమస్ టాక్ షోలకి, ప్రోగ్రామ్స్ కి అటెండ్ అయ్యారు చరణ్, ఎన్టీఆర్.

RRR: తారక్, చెర్రీ అన్నదమ్ముల బంధం.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్!

కానీ ఇప్పుడా ప్రమోషన్లన్నీ వేస్టయిపోయినట్టే. ఎందుకంటే.. అంత గ్రాండ్ గా ఆడియన్స్ లో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశారు ట్రిపుల్ఆర్ టీమ్. కానీ ఈరేంజ్ లో ప్రమోషన్లు చేసినా.. సినిమా మాత్రం ఆడియన్స్ ముందుకు రాలేకపోతోంది. ట్రిపుల్ సినిమాకి ఫస్ట్ నుంచీ ఏదోక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది. 4 ఏళ్ల ఈ సినిమా అంత ఈజీగా రిలీజ్ వరకూ రాలేదు. ఎందుకంటే.. సినిమా స్టార్ట్ అయిన దగ్గరనుంచి చాలా రకాలుగా సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. కోవిడ్ తో, షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో.. కాస్టింగ్ ఇష్యూస్ తో ఇలా రకరకాలుగా సినిమా మేకింగ్ లో చాలాసార్లు డిలే ఫేస్ చేశారు రాజమౌళి.