RTC Charges : తెలంగాణలో మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. డీజిల్ సెస్ పేరుతో భారీ వడ్డన.. రేపటి నుంచి అమల్లోకి

బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

RTC Charges : తెలంగాణలో మళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. డీజిల్ సెస్ పేరుతో భారీ వడ్డన.. రేపటి నుంచి అమల్లోకి

Rtc

RTC Charges : తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీలు పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులకు రూ.2 పెంచారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసులకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బస్సు సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా నిర్ణయించారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఇటీవల చార్జీల సవరణ పేరుతో బాదిన సంస్థ ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో బాదేసింది. పల్లె వెలుగు, సిటీ ఆర్టీనరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2 చొప్పున డీజిల్ సెస్ ను వసూలు చేయనున్నారు. ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. డీజిల్ భారాన్ని తగ్గించుకునేందుకు వడ్డన తప్పలేదని టీఎస్ఆర్టీసీ అంటుంతోంది.

TSRTC : గప్ చుప్‌‌గా ఆర్టీసీ చార్జీల పెంపు.. ఎంత పెంచారంటే

సామాన్యులు, తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని టీఎస్ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసుల్లో కనీస చార్జీ రూ.10గా ఉండనుంది. డీజిల్ రేట్లు భారీగా పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంలో టీఎస్ఆర్టీసీ రౌండప్ పేరుతో బస్సు చార్జీలను భారీగానే పెంచింది. ఇప్పుడు మరోసారి బస్సు చార్జీలు భారీ మొత్తంలో పెంచింది. దీంతో ప్రయాణికులపై ఎక్కువ భారం పడనుంది.