RCB Head Coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్

ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ను సెలక్ట్ చేసింది. ఆ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా బాధ్యతలు...

RCB Head Coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్

Rcb Head Coach

RCB’s Head Coach: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ కోచ్ గా టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ను సెలక్ట్ చేసింది. ఆ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బంగర్ నే మరో రెండేళ్ల పాటు హెడ్ కోచ్ గా కొనసాగించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే సంజయ్ ను బ్యాటింగ్ కన్సల్టెంట్ గా నియమించారు.

‘మరో రెండేళ్ల పాటు హెడ్ కోచ్ గా సంజయ్ బంగర్ ను నియమించాం’ అని మైక్ హెస్సన్ అన్నారు. ఆర్సీబీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించిన ఆయన సంజయ్ ను కొనియాడారు. అత్యున్నత గౌరవానికి సంజయ్ అర్హుడు. ముందుగా బ్యాటింగ్ కోచ్ గా మాత్రమే తెలిసిన ఆయన.. ప్లేయర్లతో, సపోర్టింగ్ స్టాఫ్ తో రిలేషన్ తో పాటు నైపుణ్యాన్ని కనబరిచాడు. టీం అంతా ఎదగడానికి ఈ రిలేషన్ సరిపోతుంది’ అని హెస్సన్ చెప్పుకొచ్చాడు.

ఇండియన్ సీనియర్ టీంకు బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ 2014 నుంచి ఐదేళ్ల పాటు పనిచేశారు. 2019 వరల్డ్ కప్ వరకూ పనిచేసి బాధ్యతలు విక్రమ్ రాథోడ్ కు అప్పగించారు.

……………………………………: హాట్‌నెస్‌తో చంపేస్తున్న భట్ బ్యూటీ!

క్రికెటర్ గా 2001 నుంచి 2004వరకూ 12టెస్టులు, 15వన్డేలు ఆడిన 49ఏళ్ల సంజయ్.. రాబోయే ఐపీఎల్ మెగా వేలంలో కోచ్ గా భాగం కానున్నాడు. సంజయ్ బంగర్ సపోర్ట్ స్టాఫ్ గా, బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తూ జట్టుకు బలాన్ని చేకూర్చారని ఆర్సీబీ ఛైర్మన్ ప్రత్మేశ్ మిశ్రా అన్నారు.