Satya Pal Malik: పుల్వామా దాడిపై సంచలన వ్యాఖ్యలు.. మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఇంటర్వ్యూలో సత్యపాల్ వెల్లడించారు

Satya Pal Malik
Satya Pal Malik: పుల్వామా దాడి సహా జాతీయ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న వైఖరి, ఇతర విషయాలపై సంచలన విషయాలను వెల్లడించిన జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు పంపింది. జమ్మూకశ్మీర్ గవర్నర్‌గా మాలిక్ ఉన్న సమయంలో రిలయన్ ఇన్సూరెన్స్ అంశానికి సంబంధించిన అంశంపై సీబీఐ సమన్లను పంపించింది. ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఆ సమన్లలో కోరింది. ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఆయనను ప్రశ్నించనున్నారు.
Prayagraj: అతీక్ అహ్మద్ హత్యపై కొత్త ప్రశ్నల్ని లేవనెత్తిన అసదుద్దీన్ ఓవైసీ
ఏప్రిల్ 14న సీనియర్ జర్నలిస్టు కరణ్ థాపర్‌కు సత్యపాల్ మాలిక్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన చాలా విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన అన్నారు. సైనికులను తరలించడానికి విమానాలు కావాలని తాను ముందుగానే కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని, అయితే అందుకు హోంమంత్రిత్వ శాఖ నో చెప్పిందని అన్నారు. ఆ తర్వాతే సైనికుల వాహనంపై దాడి జరిగిందని అన్నారు. అంతే కాకుండా దాడి గురించి మోదీకి సమాచారం అందించగా.. ఈ విషయం బయటికి చెప్పొద్దని అన్నారని, తన నోరు మూయించారని అన్నారు. బహుశా ఓట్ల కోసమే అలా చేసుంటారనే కోణంలో సైతం సత్యపాల్ మాలిక్ స్పందించారు.
Revanth Reddy : రూ.25కోట్ల లొల్లి.. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రా-ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఇంటర్వ్యూలో సత్యపాల్ వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు.