సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’.. టీజర్ అదిరిందిగా!

సత్య హీరోగా ‘వివాహ భోజనంబు’.. టీజర్ అదిరిందిగా!

Vivaha Bhojanambu: యువ కథానాయకుడు సందీప్ కిషన్‌లో అభిరుచి గల నిర్మాత, మంచి భోజన ప్రియుడు ఉన్నారు. ప్రజలకు రుచికరమైన భోజనం, వంటలు వడ్డించడానికి ‘వివాహ భోజనంబు’ పేరుతో హైదరాబాద్ నగరంతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లో రెస్టారెంట్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు ‘వివాహ భోజనంబు’ పేరుతో సందీప్ ఓ సినిమా నిర్మిస్తున్నారు.

Vivaha Bhojanambu

పలు చిత్రాలతో కమెడియన్‌గా గుర్తింపు పొందిన సత్య ఈ సినిమాతో హీరోగా మారుతున్నారు. శుక్రవారం ఫస్ట్‌లుక్‌తో పాటు టీజర్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ ఫస్ట్ లాక్‌డౌన్ వెడ్డింగ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పిసినారి మహేష్ పెళ్లి చేసుకోగానే లాక్‌డౌన్ ప్రకటించడం, బంధువులతో నిండిపోయిన ఇంట్లో కొత్త జంటకు ప్రైవసీ దొరక్క ఇబ్బంది పడడం వంటి అంశాలు హైలెట్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. టీజర్ చివర్లో సందీప్ కిషన్ నెల్లూరు ప్రభగా కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. విజువల్స్, ఆర్ఆర్ బాగున్నాయి.

ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ సమర్పణలో.. వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై రూపొందతున్న ‘వివాహ భోజనంబు’ చిత్రానికి సందీప్, శినీష్ నిర్మాతలు. రామ్ అబ్బరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.