Serum CEO : పిల్లలకు Covovax వ్యాక్సిన్ అప్పటి నుంచే!

 సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ 'కొవావాక్స్​'ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్​లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు.

Serum CEO : పిల్లలకు Covovax వ్యాక్సిన్ అప్పటి నుంచే!

Poonawala

Serum CEO  సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న మరో కోవిడ్-19 వ్యాక్సిన్ ‘కొవావాక్స్​’ను పెద్దలకు వినియోగించేందుకు ఈ ఏడాది అక్టోబర్​ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు సీరం సీఈవో అదర్ పూనావాలా శుక్రవారం తెలిపారు. ఇక, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో పిల్లలకు వినియోగించేందుకు ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో శుక్రవారం పార్లమెంట్ భవనంలో సమావేశమైన అనంతరం పూనావాలా ఈ మేరకు తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తిలో తమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సహాకారం అందిస్తోందని పూనావాలా తెలిపారు. డిమాండ్​ కి తగ్గట్టుగా కొవిషీల్డ్​ వ్యాక్సిన్ ఉత్పత్తిని విస్తరించేందుకు సీరం సంస్థ ప్రయత్నిస్తోందన్నారు.

కాగా,అమెరికాకు చెందిన నొవావ్యాక్స్ సంస్థ ఈ కొవావ్యాక్స్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. కొవావాక్స్​ టీకా పిల్లల వినియోగానికి సంబంధించి రెండో దశ క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహించేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల కమిటీ గత నెలలో సీరం సంస్థకు షరతులతో కూడిన అనుమతులిచ్చింది. 2 నుంచి 17 ఏళ్ల వయుసు మధ్య 920 మంది పిల్లలపై ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 12-17 ఏళ్ల వయసు పిల్లలు.. 460 మందిని ఒక గ్రూపుగా… 2 నుంచి 11 ఏళ్ల వయుసు మధ్య పిల్లలు 460 మందిని ఇంకో గ్రూపుగా విభజించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.

మరోవైపు, ఇవాళ ఉదయం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్​ మాండవీయాతో కూడా సీరం సీఈవో భేటీ అయ్యారు. కోవీషీల్డ్ టీకాల స‌ర‌ఫ‌రా గురించి ఈ సమావేశంలో చర్చించారు. కొవిషీల్డ్​ టీకా సరఫరాపై పూనావాలాతో ఫలప్రదమైన చర్చ జరిగిందని ట్విట్టర్​ వేదికగా మాండవీయా తెలిపారు. కోవిడ్‌19 నిర్మూల‌న‌లో సీరం సంస్థ చేస్తున్న కృష్టిని మంత్రి అభినందించారు. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని పెంచేందుకు నిరంత‌రంగా ఆ కంపెనీకి స‌పోర్ట్ ఇవ్వ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు.