Uttarakhand Politics : దేవభూమిలో కమలానికి బిగ్ షాక్..కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మంత్రి..మరో ఎమ్మెల్యే కూడా

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా

Uttarakhand Politics : దేవభూమిలో కమలానికి బిగ్ షాక్..కాంగ్రెస్ లో చేరిన బీజేపీ మంత్రి..మరో ఎమ్మెల్యే కూడా

Uk

Uttarakhand Politics  వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్ లో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పలువురు బీజేపీలో చేరిపోగా.. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర మంత్రి యష్‌పాల్ ఆర్య బీజేపీని వీడారు.

దేవభూమిగా పేరుపొందిన ఉత్తరాఖండ్ లో బీజేపీ ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు సీఎంలను మార్చిన తర్వాత పార్టీలో లుకలుకలు పెరిగాయి. ప్రస్తుత సీఎం పుష్కర్ సింగ్ ధామితో మంత్రులకు పడటంలేదు. కొందరు విమర్శలతో కాలం నెట్టుకొస్తుండగా,సీనియర్ బీజేపీ నాయకుడు మరియు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి యష్‌పాల్ ఆర్య మాత్రం ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పారు.

సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోమవారం ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మరియు ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీష్ రావత్ సమక్షంలో యష్‌పాల్ ఆర్య కాంగ్రెస్ లో చేరారు. యష్ పాల్ తో పాటు ఆయ కుమారుడు సంజీవ్ కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో చేరికకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన నివాసంలో వీరు కలిశారు.

యష్‌పాల్ ఆర్య 2017 వరకు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2002-2007 మధ్యకాలంలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గా పనిచేశారు. 2007 నుంచి 2014దాకా ఉత్తరాఖండ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. మోదీ హవాలో కాంగ్రెస్ బలహీనపడటంతో 2017లో బీజేపీలో చేరిన యష్‌పాల్ ఆర్య.. మళ్లీ ఇప్పుడు సొంత గూటికి చేరారు.

యష్‌పాల్ ఆర్య ప్రస్తుతం ముక్తేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక,ఆయన కుమారుడు సంజీవ్ ఆర్య నైనిటాల్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ALSO READ మరో తుపాన్ ముప్పు..బీ అలర్ట్