Bengal: అక్రమ బాణాసంచా కారాగారంలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం "యుద్ధ ప్రాంతం"లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోంది

Bengal: అక్రమ బాణాసంచా కారాగారంలో అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి

Massive Blast: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న ఒక బాణాసంచా కారాగారం ఉన్నట్టుండి అగ్ని ప్రమాదానికి గురవడంతో సుమారు ఏడుగురు మరణించారు. నివాస భవనంలోనే బాణాసంచా తయారీ కొనసాగిస్తున్నారు. ఈ పేలుడుతో భవనం మొత్తం కూలిపోయింది. కాగా, ఈ ఘటనపై బెంగాల్ విపక్ష నేత సువేందు అధికారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)తో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

Karnataka CM: సిద్ధూ కాదు డీకే కాదు.. కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడో వ్యక్తి?

చుట్టుపక్కల ఉన్న చెరువుతో సహా శరీర భాగాలు, శిధిలమయమైన ఇల్లు.. పేలుడు సంభవించిన ప్రాంతం మొత్తం “యుద్ధ ప్రాంతం”లా మారిందని గ్రామస్థులు తెలిపారు. “పశ్చిమ బెంగాల్-ఒడిశా సరిహద్దుకు సమీపంలోని ఒక గ్రామంలోని ఇంట్లో అక్రమ బాణసంచా కేంద్రం పని చేస్తోంది. ఈ పేలుడులో ఏడుగురు మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై విచారణ జరుగుతోంది’’ అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

Patna : ముస్లిం యువతితో స్నేహంగా ఉన్నాడని హిందూ కుర్రాడిని దారుణంగా కొట్టేసారు

మృతుల బంధువులకు ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం తెలిపింది. ఎగ్రా పోలీస్ స్టేషన్‌కు చెందిన స్థానిక పోలీసు చీఫ్‌ ఈ సమాచారం తెలుసుకోకుండా ఉన్నందుకు ఆయనపై చర్యలు తీసుకుంటామని మమత అన్నారు. ఎన్‌ఐఏ విచారణకు బీజేపీ డిమాండ్‌ చేయడంపై బెనర్జీ మాట్లాడుతూ, దర్యాప్తును కేంద్ర ఏజెన్సీ చేపట్టడంలో తనకు అభ్యంతరం లేదని అన్నారు.