Aryan Khan: షారుఖ్ ఖాన్ కుమారుడు ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోగా కాదు!

బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంలో ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్..

Aryan Khan: షారుఖ్ ఖాన్ కుమారుడు ఇండస్ట్రీ ఎంట్రీ.. హీరోగా కాదు!

Aryan Khan

Aryan Khan: బాలీవుడ్ బాద్ షా.. కింగ్ ఖాన్ షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నాడనే విషయంలో ఇప్పుడు బీ టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో షారుఖ్ ఫ్యామిలీ చాలా ఇబ్బందులను ఎదుర్కొంది. జైల్లో ఉన్న కొడుకుని విడిపించుకోవడానికి షారుఖ్ చేయని ప్రయత్నం లేదు. ఆర్యన్ ను కావాలనే ఈ కేసులో ఇరికించారనే మాటలు కూడా వినిపించాయి. ఫైనల్ గా ఆర్యన్ జైలు నుంచి బయటపడ్డాడు.

Aryan Khan: ఆర్యన్ డ్రగ్స్ కేసులో మలుపు.. కీలక సాక్షి ప్రభాకర్ సెయిల్ మృతి ..

ఇప్పుడు తమ కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు షారుఖ్-గౌరీఖాన్ దంపతులు. కానీ హీరోగా మాత్రం కాదట. బాలీవుడ్‌కు ఆర్యన్ ఖాన్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడట. త్వరలోనే ఆర్యన్ ఖాన్‌ ఒక వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. అందుకోసం ఇప్పటికే కథను కూడా సొంతంగా రాసుకున్న ఆర్యన్‌ ఖాన్‌.. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టెస్ట్‌ షూట్‌ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ షారుఖ్‌ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోంది.

Aryan Khan : ఆర్యన్ ఖాన్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవ్..బాంబే హైకోర్టు

అంతకుముందే కొన్నాళ్లుగా ఆర్యన్ ఖాన్ ప్రముఖ దర్శకుల దగ్గర ఫిల్మ్ మేకింగ్ క్లాసులు నేర్చుకోగా.. ఇప్పుడు దర్శకత్వ బాధ్యతల నిర్వహణకు ప్లాన్ గా ముందుకెళ్లే ప్రయత్నాలు మొదలు పెట్టాడట. ఇప్పటికే ఏప్రిల్‌ 8, 9 తేదిల్లో వెబ్ సిరీస్ కోసం టెస్ట్‌ షూట్‌ నిర్వహించగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలు పెట్టారట. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ షూటింగ్‌ మొదలు పెట్టనున్నారట. ఇక షారుఖ్ కూతురు సుహానా ఇప్పటికే వెబ్ సిరీస్ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ఈ వెబ్‌ సిరీస్‌కు జోయా అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్నారు.