Maharashtra Political Crisis: శివసేన షిండే చేతుల్లోకి..! ఉద్ధవ్ వద్ద కేవలం 16 మంది ఎమ్మెల్యేలు..

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటగంటకు రసవత్తరంగా మారుతోంది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే బలం తగ్గిపోతుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యు ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఒక్కొక్కరుగా శివసేన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు షిండే క్యాంపులో 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే బలం 43కు చేరింది.

Maharashtra Political Crisis: శివసేన షిండే చేతుల్లోకి..! ఉద్ధవ్ వద్ద కేవలం 16 మంది ఎమ్మెల్యేలు..

Maharastra (2)

Updated On : June 23, 2022 / 11:41 AM IST

Maharashtra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం గంటగంటకు రసవత్తరంగా మారుతోంది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే బలం తగ్గిపోతుంది. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే వర్గంలోకి ఒక్కొక్కరుగా శివసేన ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు షిండే క్యాంపులో 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. మరో నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే బలం 43కు చేరింది. శివసేన పార్టీ తరపును 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 56 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. అయితే ఇప్పటికే 39 ఎమ్మెల్యేలు సిండే క్యాంప్ లోకి చేరడంతో షిండే క్యాంప్ బలం 2/3 మెజారిటీ దాటింది. ఈ క్రమంలో శివసేన పార్టీ తనదేనంటూ ఏక్ నాథ్ షిండే ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. తన వర్గం గుర్తింపు కోసం డిప్యూటి స్పీకర్, ఎన్నికల సంఘం, గవర్నర్ కు లేఖ రాసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Maharashtra Political Crisis: అదునుకోసం వేచిచూసి.. మహా ‘సంక్షోభం’లో వ్యూహరచన అతనిదేనా..

మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఏక్ నాథ్ షిండే ఇచ్చిన షాక్ తో శివసేన అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సాయంత్రంకు ఉద్ధవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది. మరికొద్ది రోజుల్లో ఏక్ నాథ్ షిండేతో కలిసి బీజేపీ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండే కు మద్దతుగా ప్లెక్సీలె వెలిశాయి. మీరు ముందుకు వెళ్ళండి.. మీ వెంట మేమున్నాం అంటూ ఫ్లెక్సీలు ప్రచురించారు. ఫ్లెక్సీలో ఆనంద్ దిఘే , బాలాసాహెబ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే ఫోటోలు ఉన్నాయి. అయితే గౌహతిలో రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్ నాథ్ షిండే సమావేశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటు తదుపరి కార్యాచరణపై షిండే వారితో చర్చించారు. ఇప్పటికే గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన ఏక్‌నాథ్ షిండే తనవర్గం ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ ను కలిసే అవకాశాలు ఉన్నాయి.

Maharashtra Political Crisis: అదునుకోసం వేచిచూసి.. మహా ‘సంక్షోభం’లో వ్యూహరచన అతనిదేనా..

మరోవైపు మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఉద్దవ్ థాకరే, శరద్ పవార్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉధయం 11 గంటలకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో శరద్ పవార్ సమావేశం కానున్నారు. అదేవిధంగా 11.30 గంటలకు తన వర్గంలో ఉన్న శివసేన ఎమ్మెల్యేలతో ఉద్ధవ్ థాకరే సమావేశం కానున్నారు. తొలుత శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ కు సీఎం పదవి అప్పగిస్తే సమస్య కొలిక్కి వస్తుందని ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ఉద్ధవ్ థాకరేకు సూచించినట్లు తెలిసింది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉండే ప్రసక్తే లేదని షిండే స్పష్టం చేసినట్లు సమాచారం.