Navjot Sidhu : సీఎం ముందే సిక్స్ కొట్టిన సిద్ధూ

పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

Navjot Sidhu : సీఎం ముందే సిక్స్ కొట్టిన సిద్ధూ

Sidhu (2)

Navjot Sidhu  పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవజోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పీసీసీ సారథిగా కొద్దిరోజుల క్రితం నియమితులైన సిద్ధూ.. శుక్రవారం చంఢీగఢ్​లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సహా పార్టీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరై.. సిద్ధూని అభినందించారు.

అయితే టీమిండియా మాజీ క్రికెటర్ కూడా అయిన సిద్ధూకి సిక్స‌ర్ల సిద్ధూగా పేరున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అయిన త‌ర్వాత కూడా సిక్స్ కొడ‌తాన‌న్న‌ట్లుగా సిద్ధూ స్టేజ్‌పైనే ఓ షాట్ ఆడారు. ప్ర‌మాణ స్వీకారం చేయాల్సిందిగా త‌న పేరును పిల‌వ‌గానే.. సిద్ధూ నిజంగానే బ్యాటింగ్ చేయ‌డానికి వెళ్తున్న‌ట్లుగా వామ‌ప్ చేస్తూ కుర్చీలో నుంచి లేచి ఓ సిక్స‌ర్ షాట్ ఆడుతున్న‌ట్లుగా చేతులు ఊపారు. ఆ స‌మ‌యంలో సీఎం అమ‌రీంద‌ర్ ఆ ప‌క్క‌నే కూర్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.

పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సిద్ధూ మాట్లాడుతూ..నేను మీతో భుజం భుజం కలిపి పని చేస్తాను. నాకు అహం లేదు. మా ప్రత్యర్థి పార్టీలు చెబుతున్న దానికి విరుద్ధంగా ఈ రోజు కాంగ్రెస్ ఐక్యంగా ఉందని దూకుడు శైలిలో సిద్ధూ మాట్లాడారు. నన్ను వ్యతిరేకించే వారు నన్ను మెరుగుపరుస్తారు అని పరోక్షంగా గతంలో తనకు సీఎం అమరీందర్ సింగ్ కి ఉన్న విభేధాలు తొలిగినట్లేనని సంకేతమిచ్చారు.

కాగా,పంజాబ్ సీఎంగా అమ‌రీంద‌ర్‌ను దించాల్సిందే అంటూ పోరాడిన సిద్ధూ చివ‌రికి పీసీసీ చీఫ్ ప‌ద‌విని ద‌క్కించుకున్న విషయం తెలిసిందే. ఆయ‌న‌కు ఈ ప‌ద‌వి ఇవ్వ‌డాన్ని అమ‌రీంద‌ర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. అయితే ఈ ఇద్ద‌రూ శుక్ర‌వారం చాయ్ పే చ‌ర్చ అంటూ త‌మ మ‌ధ్య విభేదాల‌ను ప‌రిష్క‌రించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌మాణ స్వీకారానికి ముందు పంజాబ్ భ‌వ‌న్‌లో అమ‌రీంద‌ర్‌కు రెండు చేతులు జోడించి స్వాగ‌తం ప‌లికారు సిద్దూ. ఎలా ఉన్నారు.. మీరు రావ‌డం సంతోషంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా సిద్ధూ అన్నారు. మరోవైపు, వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే.