Singareni Collieries : సింగరేణిలో మోగిన సమ్మె సైరన్..యాజమాన్యానికి సమ్మె నోటీసులు

తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణి. నల్లబంగారంగా పేరొందిని సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తామనే కేంద్రం ఇచ్చిన సంకేతాలతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.

Singareni Collieries : సింగరేణిలో మోగిన సమ్మె సైరన్..యాజమాన్యానికి సమ్మె నోటీసులు

Singareni Collieries employee unions going for strike : తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణి. నల్లబంగారంగా పేరొందిని సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తామనే కేంద్రం ఇచ్చిన సంకేతాలతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దీనికి సంబంధించి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు కార్మిక సంఘాల నాయకులు.కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టబోతున్నారు. మార్చి 28, 29 తేదీల్లో సమ్మెను చేపట్టబోతున్నామని సింగరేణి యాజమాన్యానికి ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు నోటీసులు అందించాయి.

సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు చాలా సార్లు ప్రమాదాలకు గురి కావటం జరుగుతోంది. ఈ ప్రమాదాల్లో ఎంతమంది ప్రాణాలు ఆ బొగ్గు గనుల్లోనే సజీవ సమాధి అయిపోతుంటాయి. అయినా సరే కార్మికులు ఏమాత్రం భయపడకుండా నల్లబంగారం ఉత్పత్తిలో ఏమాత్రం వెనుకాడరు. ఉత్పత్తి చేస్తునే ఉంటారు. అలా ప్రాణాలకు తెగించి గనుల్లోపలికి వెళ్లి బొగ్గు ఉత్పత్తిలో కీలకంగా మారిన సింగరేణి బొగ్గుపై కేంద్రం కన్ను పడింది. ఈ కోల్ మైన్ ను ప్రైవేటీకరణ చేయటానికి కంకణం కట్టుకుంది. దీన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే సమ్మెకు పిలుపునిచ్చారు.

సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి బ్లాక్, కొయ్యగూడెం బ్లాక్, కళ్యాణిఖని బ్లాక్ 6లను కేంద్రం ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైన నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్తున్నాయి. ప్రైవేటీకరణను ఆపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో కూడా సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టారు. డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారు. అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తోంది. సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తే సమరమే అంటూ కేంద్రానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.