SIR Movie: బంజారా సాంగ్‌తో వస్తున్న ధనుష్ ‘సార్’!

తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఓ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తుండగా, ఆయనకు ఇది తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా.

SIR Movie: బంజారా సాంగ్‌తో వస్తున్న ధనుష్ ‘సార్’!

SIR Movie Second Single To Be Out On This Date

SIR Movie: తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం ‘సార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఓ స్కూల్ టీచర్ పాత్రలో నటిస్తుండగా, ఆయనకు ఇది తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా.

Dhanush Sir Movie : కొంచెం లేటుగా వస్తానంటున్న ‘సార్’..

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ అనౌన్స్‌మెంట్ చేసింది. ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను జనవరి 17న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ‘బంజారా’ అంటూ తెలుగులో వచ్చే ఈ పాట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Sir Movie: ధనుష్ ‘సార్’ మనసు మార్చుకున్నాడా.. మళ్లీ అదే బాటలో..?

ఇక ఈ సినిమాలో అందాల భామ సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, జివి.ప్రకాశ్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ రెండో సాంగ్‌కు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.