Disha encounter : సుప్రీంకోర్టులో “దిశ” కమిషన్ నివేదిక

ఈ ఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ కంప్లీట్ చేసింది. డిసెంబర్ 2019 లో ఈ విచారణ మొదలైంది. కరోనా కారణంగా విచారణ ఆలస్యంగా జరిగింది.

Disha encounter : సుప్రీంకోర్టులో “దిశ” కమిషన్ నివేదిక

Disha

Sirpurkar Commission : సుప్రీంకోర్టుకు దిశ కమిషన్ నివేదిక చేరింది. 47 రోజుల్లో మొత్తం 57 మంది సాక్షులను విచారించిన కమిషన్.. తుది నివేదికను రూపొందించింది. విచారణలో ఫోరెన్సిక్, పోస్టుమార్టం నివేదికలు, ఫొటోగ్రాఫ్స్, వీడియో గ్రాఫ్స్ తో పాటు వివిధ డాక్యుమెంటరీలను కమిషన్ సేకరించింది. 19-2019 క్రైమ్ నెంబర్ 784 నిందితుల గా జోల్లు శివ, నవీన్,ఆరిఫ్ మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నెకేశవులున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో జరిగిన ఎన్ కౌంటర్ పై కమిషన్ విచారణ కంప్లీట్ చేసింది. డిసెంబర్ 2019 లో ఈ విచారణ మొదలైంది. కరోనా కారణంగా విచారణ ఆలస్యంగా జరిగింది. రెండు రోజుల క్రితం 2022, జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టుకు సిర్పూర్కర్ కమిషన్ నివేదిక సమర్పించింది.

Read More : ఏపీ ఉద్యోగులకు రేపే జీతాల చెల్లింపు

– నవంబర్‌ 28, 2019న రాత్రి డాక్టర్‌ దిశను చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ అనే నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి హత్యచేయగా.. ఒక్కరోజులోనే వారిని పట్టుకున్నారు పోలీసులు.
– అనంతరం సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా సంఘటనా స్థలానికి తీసుకుని వెళ్లగా.. డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున వారు పారిపోయేందుకు ప్రయత్నించారు.
– పోలీసుల ఆయుధాలను లాక్కొని కాల్పులకు యత్నించగా ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు. చటాన్‌పల్లి బ్రిడ్జ్ వద్ద నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు పోలీసులు.
– దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ను వ్యతిరేకిస్తూ.. జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ యాదవ్‌ అనే ఇద్దరు న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Read More : 1961 January 31 : అంతరిక్షంలోకి మొదటిసారి చింపాంజీని పంపిన రోజు..

– ఎన్‌కౌంటర్ తర్వాత నిందితుల మృతిపై సుప్రీంకోర్టు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సిర్పూర్ కర్, బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా ప్రకాష్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్‌లను నియమించారు.
– దిశ ఎన్ కౌంటర్ ఘటనలో ఆర్టీసీ ఎండీ, అప్పటి సైబరాబాద్ సీపీగా ఉన్న సజ్జనార్ ను కూడా సిర్పూర్కర్ కమిషన్ విచారించింది.
– ఎన్‌‍కౌంటర్ నిజమా? ఫేక్ ఎన్‌కౌంటర్ అని తేల్చనుంది కమిషన్.
– 2022, జనవరి 28వ తేదీన సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది కమిషన్.