National Herald case: 6గంటల పాటు సోనియాను విచారించిన ఈడీ.. రేపు మరోసారి హాజరుకావాలని సమన్లు

నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు.

National Herald case: 6గంటల పాటు సోనియాను విచారించిన ఈడీ.. రేపు మరోసారి హాజరుకావాలని సమన్లు

Sonia Gandhi

National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణలో మంగళవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) అధికారులు ఆరు గంటలపాటు విచారించారు. ఉదయం 11గంటలకు దర్యాప్తు సంస్థ విచారణను ప్రారంభించింది. మధ్యలో పలుసార్లు బ్రేక్ నిస్తూ.. సాయంత్రం 6గంటల వరకు విచారణ కొనసాగింది. అయితే బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు సోనియాకు సమన్లు జారీ చేశారు.

Sonia Gandhi : నేడు మరోసారి ఈడీ ముందుకు సోనియా గాంధీ

రెండో రోజు విచారణలో భాగంగా ఉదయం 11గంటలకు సోనియా తన కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందంటూ నిరసనగా రాహుల్ గాంధీ పార్లమెంటు నుండి రాష్ట్రపతి భవన్ వరకు కాంగ్రెస్ ఎంపీలతో కలిసి మార్చ్‌ నిర్వహించారు. ప్రియాంక గాంధీ తన తల్లికి వైద్య సహాయం అవసరమైతే మందులతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలోని మరొక గదిలో కూర్చున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.

Congress Leader: కాంగ్రెస్ లీడర్ జుట్టు పట్టుకుని లాగిన ఢిల్లీ పోలీసులు

సమన్ల ధృవీకరణ, హాజరు షీట్ పై సంతకంతో సహా పత్రాలను పూర్తిచేసిన సోనియాగాంధీ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయడం ఉదయం 11:15 గంటలకు ఈడీ అధికారులు ప్రారంభించారు. విచారణ సందర్భంగా అన్ని COVID-19 భద్రతా నియమాలు అనుసరించారు. ఇద్దరు వైద్యులు, అంబులెన్స్ సిద్ధంగా ఉంచినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఇదిలాఉంటే పోలీసులు భారీ బలగాలను మోహరించారు. సెంట్రల్ ఢిల్లీలోని విద్యుత్ లేన్‌లోని ఆమె ఇంటికి, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి మధ్య 1 కి.మీ దూరం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు.

Supreme court : ఉచిత హామీల‌పై సుప్రీంకోర్టు ఆందోళన..నిరోధించే చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సూచన

రెండు రోజులు విచారణలో భాగంగా సోనియా గాంధీని 55 ప్రశ్నలు అడిగినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రాహుల్ గాంధీని అడిగినటువంటి ప్రశ్నలనే సోనియాను అడిగినట్లు వారు పేర్కొన్నారు. సోనియా విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తంగా మారింది. పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. దీంతో రాహుల్ గాంధీతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు.