Shashi Tharoor : మహిళా ఎంపీలతో శశి థరూర్ సెల్ఫీ..నెటిజన్ల విమర్శలతో క్షమాపణ

  పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి

Shashi Tharoor : మహిళా ఎంపీలతో శశి థరూర్ సెల్ఫీ..నెటిజన్ల విమర్శలతో క్షమాపణ

Tharoor

Shashi Tharoor :  పార్లమెంట్‌ శీతకాల సమావేశాలు ప్రారంభం రోజునే కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌కు చేదు అనుభవం ఎదురైంది. రచయిత, వక్త, మేధావిగా పేరొందిన శశి థరూర్ బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి హోదాలో ఉండి తోటి మహిళా ఎంపీల అందచందాలు, ఆకర్షణీయత గురించి సగటు మగవాడిలా కామెంట్ చేయడం వివాదానికి దారితీసింది. థరూర్.. చాలా సంతోషంగా సోమవారం ఉదయం చేసిన ఓ ట్వీట్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో చివరకు ఆయన క్షమాపణ చెప్పక తప్పలేదు.

ఏం జరిగింది

పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా సోమవారం ఉదయం శశి థరూర్‌ ట్విటర్‌లో మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఓ ఫోటో షేర్‌ చేశారు. ‘‘లోక్‌సభ పని చేయడానికి ఆకర్షనీయమైన ప్రదేశం కాదని ఎవరు చెప్పారు. ఈ రోజు ఉదయం నేను నా తోటి ఆరుగురు మహిళా ఎంపీలను కలిశాను’’ అనే క్యాప్షన్‌తో థరూర్ షేర్‌ చేసిన ఈ ఫోటో విమర్శల పాలయ్యింది.

మహిళలపట్ల థరూర్ వివక్షతో వ్యవహరించారని నెటిజన్లు ఆరోపించారు. “బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి.. తోటి మహిళా ఎంపీల గురించి ఇలాంటి సెక్సియెస్ట్‌ కామెంట్‌ చేయడం ఎంత వరకు సబబు.. అంటే మహిళలు అందంగా ఉంటారు.. వారితో కలిసి పని చేయడం సంతోషం అని మీ ఉద్దేశమా.. ఆడవారు అంటే కేవలం వారి బాహ్య సౌందర్యం మాత్రమే కనిపిస్తుందా.. సమానత్వం అంటూ ప్రసంగాలు ఇస్తారు.. మరి ఇదేంటి సార్‌’’ అంటూ ఓ రేంజ్‌లో శశి థరూర్‌ని ట్రోల్‌ చేశారు నెటిజన్లు. సరదాకు చేసిన పని కాస్త ఇలా రివర్స్‌ కావడంతో శశి థరూర్‌ ట్విటర్‌ వేదికగా క్షమాపణలు చెప్పారు.

సారీ చెప్తూ మరో ట్వీట్‌ చేశారు శశి థరూర్‌. ‘‘ఇలా అందరం కలిసి సెల్ఫీ దిగడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఇదంతా స్నేహపూర్వక వాతావరణంలో చోటు చేసుకుంది. అదే స్ఫూర్తితో వారు(మహిళా ఎంపీలు) ఈ ఫోటోను ట్వీట్‌ చేయమని కోరారు…నేను చేశాను. కానీ ఈ ఫోటో వల్ల కొందరు బాధపడ్డట్లు తెలిసింది. అందుకు క్షమాపణలు చెప్తున్నాను. కాకపోతే పనిచేసే చోట ఇలాంటి స్నేహపూర్వక ప్రదర్శనలో పాల్గొనడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అని ట్వీట్ లో శశి థరూర్‌ తెలిపారు.

కాగా,ఉదయం థరూర్ షేర్ చేసిన సెల్ఫీలో ఆయనతోపాటు సుప్రియా సూలే (ఎన్పీపీ),అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ (కాంగ్రెస్), తమిళచి తంగపాండ్యన్ (డీఎంకే), మిమి చక్రబర్తి (టీఎంసీ), నుస్రత్ జహాన్ (టీఎంసీ), జోతిమాన్ సెన్నిమలై (కాంగ్రెస్) ఉన్నారు. సెల్ఫీని మిమి చక్రవర్తి తీసినట్లు తెలుస్తోంది. శశి థరూర్ ఈ మహిళా ఎంపీల మధ్యలో ఉన్నారు.

ALSO READ Farm Laws Repeal bill : 750 మంది రైతులకు నివాళి..రాకేష్ టికాయత్