Sulthan : యుద్ధం లేని మహాభారతాన్ని ఊహించుకోండి.. ‘సుల్తాన్’ టీజర్..

Sulthan : యుద్ధం లేని మహాభారతాన్ని ఊహించుకోండి.. ‘సుల్తాన్’ టీజర్..

Sulthan: అన్నయ్య సూర్య లాగానే తమిళ్‌తో పాటు తెలుగులోనూ మంచి ఆదరణ, మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు యువ నటుడు కార్తి. సినిమా సినిమాకీ కథ, పాత్రల పరంగా వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ‘ఖైది’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కార్తి తాజా చిత్రం ‘సుల్తాన్’..

ఈ సినిమాతో రష్మికా మందన్న కోలీవుడ్‌కి పరిచయం అవుతోంది. కణ్ణన్ దర్శకత్వంలో, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్న ‘సుల్తాన్’ చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదలవుతోంది. సోమవారం టీజర్ రిలీజ్ చేశారు.

‘‘మహాభారతంలో కృష్ణుడు వంద అవకాశాలిచ్చినా.. కౌరవులు మారలేదు.. కృష్ణుడు పాండవులవైపు నిల్చున్నాడు.. అదే కృష్ణుడు కౌరవులవైపు ఉంటే.. అదే మహాభారతాన్ని ఒకసారి యుద్ధం లేకుండా ఊహించుకోండి సార్’’ వంటి డైలాగులతో ‘సుల్తాన్’ బ్యాక్ డ్రాప్ ఏంటనేది క్లుప్తంగా చెప్పారు. టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. కార్తీ మరోసారి డిఫరెంట్ రోల్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకోనున్నాడనిపిస్తోంది.

ఏప్రిల్ 2న తమిళ్, తెలుగు భాషల్లో భారీ స్థాయిలో ‘సుల్తాన్’ విడుదల కానుంది. ఈ సినిమాకి సంగీతం : మెర్విన్, కెమెరా : సంతోష్ సూర్యన్, ఎడిటింగ్ : రూబెన్, ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్, ఆర్ట్ : రవిచంద్రన్, ఫైట్స్ : దిలీప్ సుబ్బరాయన్.