Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు

మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు తీర్పును వెల్ల‌డించింది.

Maharashtra: శివసేనకు షాక్.. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court

Maharashtra: మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. రేపు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర గవర్నర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు తీర్పును వెల్ల‌డించింది. బలపరీక్షపై స్టే ఇవ్వాలని కోరిన శివసేన అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించ‌లేదు.

Maharashtra: ఏదైనా పొర‌పాటు జ‌రిగితే క్ష‌మించాలని సీఎం ఉద్ధ‌వ్ అన్నారు: మంత్రి రాజేంద్ర

రేపు మ‌హారాష్ట్ర అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని సుప్రీంకోర్టు చెప్పింది. దీంతో, మహారాష్ట్ర ప్రభుత్వం రేపు బలపరీక్ష ఎదుర్కోవడం తప్పనిసరి అయింది. మహరాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష అంశంపై గ‌వ‌ర్న‌ర్ కోష్యారి ఇచ్చిన ఆదేశాల‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. దానిపై తాము మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇవ్వ‌లేమ‌ని పేర్కొంది. రేపు ఉదయం 11 గంటలకు మహా వికాస్ అఘాడీ సర్కారు బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముందస్తుగా పలు నిర్ణయాలు తీసుకుంటోంది. తమ ఎమ్మెల్యేలను హోటల్ కు తరలిస్తోంది.

Maharashtra: రేపు బ‌ల‌ప‌రీక్ష‌.. నేడు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న మ‌హారాష్ట్ర కేబినెట్‌

శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తమ పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్యాంపు ఏర్పాటు చేయడంతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ప్రారంభమైంది. ఆయన తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అంటున్నారు. రేపు తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.