Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

Agnipath: ‘అగ్నిపథ్’పై వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

Agnipath

Agnipath: కేంద్రం గత నెలలో ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీంపై సుప్రీంకోర్టు వచ్చే వారం విచారణ జరపనుంది. ఈ పథకాన్ని సవాలు చేస్తూ ఎమ్ఎల్ శర్మ అనే అడ్వకేట్ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీన్ని స్వీకరించిన సుప్రీంకోర్టు వచ్చేవారం దీనిపై విచారణ జరుపనున్నట్లు వెల్లడించింది.

Narendra Modi: నేటి నుంచి డిజిటల్ ఇండియా వీక్.. ప్రారంభించనున్న మోదీ

ఈ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్, సైన్యంలో చేరే వారి ఉపాధి, ఉద్యోగ కాల పరిమితి 20 నుంచి 4 ఏళ్లకు తగ్గిపోతుందని శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా 70 వేల మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, వారంతా ఇప్పుడు అపాయింట్‌మెంట్ల కోసం ఎదరుచూస్తున్నారని ఎమ్ఎల్ శర్మ తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ పథకాన్ని రద్దు చేయాలని పిటిషన్‌లో కోరినట్లు ఆయన వెల్లడించారు. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం ద్వారా యువతకు సైన్యంలో అవకాశం లభిస్తుంది. అ

Maharashtra: అవును మాది ‘ఈడీ’ ప్ర‌భుత్వమే: దేవేంద్ర ఫ‌డ్న‌వీస్

యితే, దీని కాలపరిమితి నాలుగేళ్లు మాత్రమే. నాలుగేళ్ల తర్వాత తమ భవిష్యత్ ఏంటని యువత ఆందోళన చెందుతోంది. అందుకోసమే దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఈ పథకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాగా, భారీ స్థాయిలో స్పందన వస్తోంది.