Jailer Movie : మొన్న తమిళనాడు సీఎం.. నిన్న కేరళ సీఎం.. సూపర్ స్టార్ సినిమాకి క్యూ కడుతున్న రాజకీయ నేతలు..

సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ బేస్ గురించి అందరికి తెలిసిందే. తమిళనాడు, ఇండియాలోనే కాక సింగపూర్, మలేషియా, జపాన్.. లాంటి చాలా దేశాల్లో రజినీకాంత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

Jailer Movie : మొన్న తమిళనాడు సీఎం.. నిన్న కేరళ సీఎం.. సూపర్ స్టార్ సినిమాకి క్యూ కడుతున్న రాజకీయ నేతలు..

Tamilanadu CM Stalin Kerala CM Pinarayi Vijayan and so many Political leaders watching Rajinikanth Jailer Movie in Theater

Updated On : August 13, 2023 / 11:53 AM IST

Jailer Movie :  సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’(Jailer) సినిమా ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో నటించారు. జైలర్ సినిమా భారీ విజయం సాధించి ఇప్పటికే మూడు రోజుల్లోనే 220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ బేస్ గురించి అందరికి తెలిసిందే. తమిళనాడు, ఇండియాలోనే కాక సింగపూర్, మలేషియా, జపాన్.. లాంటి చాలా దేశాల్లో రజినీకాంత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ దేశాల్లో కూడా జైలర్ సినిమాకు భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక రజినీకాంత్ ఫ్యాన్స్ అంతా థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. ఇప్పటి జనరేషన్ సంగతేమో కానీ ఇప్పుడు పెద్దవాళ్లంతా అప్పట్లో రజినీకాంత్ కి వీరాభిమానులు. ఇప్పటికి కూడా అదే అభిమానంతో ఆయన సినిమాని చూస్తున్నారు. హీరోలు, రాజకీయ నాయకులు, పలువురు సెలబ్రిటీలు.. అందరూ తలైవార్ అభిమానులే. జైలర్ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో అంతా థియేటర్ కి వెళ్లి మరీ సినిమా చూస్తున్నారు.

Bro Movie OTT Update : ‘బ్రో’ సినిమా ఓటీటీ రిలీజ్ అప్పుడే.. థియేటర్ షో ముగిసినట్టే..?

ఈ నేపథ్యంలో మొన్న తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా రజిని ఫ్యాన్ కావడంతో థియేటర్ కి కుటుంబంతో వెళ్లి జైలర్ సినిమా చూశాడు. సినిమా బాగా నచ్చడంతో డైరెక్టర్ నెల్సన్ ని ప్రత్యేకంగా పిలిచి మరీ అభినందించాడు. తాజాగా నిన్న కేరళ సీఎం పినరయి విజయన్ కూడా ఫ్యామిలీతో థియేటర్ కి వెళ్లి జైలర్ సినిమా చూశాడు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. తమిళనాడు, కేరళలో పలు రాజకీయ నేతలు కూడా జైలర్ సినిమా థియేటర్లో చూసేందుకు వెళ్తున్నారు. అన్ని రంగాల సెలబ్రిటీలు, రాజకీయ నాయకులతో పాటు ఏకంగా సీఎంలు కూడా ఫ్యామిలీలతో కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాకు వెళ్తుండటంతో ఆయన రేంజ్ ఏంటో మరోసారి అందరికి తెలుస్తుంది.