Tapsee : హీరోయిన్స్ పై ఇప్పటికీ వివక్ష ఉంది.. నేను నిర్మాతగా ఉన్న సినిమా సెట్స్ లో అది కనిపించదు..

తాప్సీ పన్ను మాట్లాడుతూ.. ''నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఇచ్చే కార్వాన్‌లు అగ్గిపెట్టెల్లా చిన్నగా ఉండేవి. హీరోలకి, బాగా పేరున్న నటులకు డబుల్‌ డోర్‌ కార్వాన్ వెహికిల్స్‌ పెట్టేవారు.

Tapsee : హీరోయిన్స్ పై ఇప్పటికీ వివక్ష ఉంది.. నేను నిర్మాతగా ఉన్న సినిమా సెట్స్ లో అది కనిపించదు..

Tapsee

Tapsee :  సినీ పరిశ్రమలలో హీరోలకి, హీరోయిన్స్ కి, అలాగే మిగిలిన ఆర్టిస్టుల మధ్య వ్యత్యాసాలు చూపిస్తూ ఉంటారు. ఎవరి రేంజ్ కి తగ్గట్టు వారికి సౌకర్యాలు, మర్యాదలు ఉంటాయి. ఇది అందరికి తెలిసిన విషయమే. కొంతమంది దీనిపై బహిరంగంగానే మాట్లాడతారు. ఇటీవల కొంతమంది హీరోయిన్స్ హీరోలని ఒకలా, మమ్మల్ని ఒకలా చూస్తారు అని అన్నారు. తాజాగా ఈ బాటలో హీరోయిన్ తాప్సీ చేరింది. ఇటీవల యిచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో ఉన్న వివక్ష గురించి మాట్లాడింది.

Macharla Niyojavargam : మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ లాంచ్ ఈవెంట్

తాప్సీ పన్ను మాట్లాడుతూ.. ”నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మాకు ఇచ్చే కార్వాన్‌లు అగ్గిపెట్టెల్లా చిన్నగా ఉండేవి. హీరోలకి, బాగా పేరున్న నటులకు డబుల్‌ డోర్‌ కార్వాన్ వెహికిల్స్‌ పెట్టేవారు. మేకప్‌, కాస్ట్యూమ్‌, హెయిర్‌ స్టైలిస్ట్ లాంటి సహాయకుల విషయంలో కూడా చిన్న చూపు ఉండేది. స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న తర్వాత కూడా హీరోలతో పోల్చితే మాకు ఇస్తున్న రెమ్యునరేషన్స్ లో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. కాని నేను నిర్మాతగా మారిన తర్వాత నా సినిమా సెట్స్ లో ఈ తేడాలు లేకుండా చూసుకుంటున్నాను. లేడి ఆర్టిస్టులకి, వర్కర్స్ కి కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుతున్నాను” అని తెలిపింది.