Telangana : మధ్యాహ్నంతో ముగియనున్న డెడ్ లైన్‌‌.. నెక్ట్స్ స్టెప్ ?

సోమవారం ఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చి చెప్పాలని.. మిగతా రాష్ట్రాల్లో మాదిరే తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్‌...

Telangana : మధ్యాహ్నంతో ముగియనున్న డెడ్ లైన్‌‌.. నెక్ట్స్ స్టెప్ ?

Kcr In Delhi

KCR Dead Line 24 Hrs : ధాన్యం కొనుగోలుపై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ పెట్టిన డెడ్‌లైన్ ముగియడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. 2022, ఏప్రిల్ 12వ తేదీ మంగళవారం మధ్యాహ్నంతో ముగియనుంది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకెళుతుందనే ఉత్కంట అందరీలో నెలకొంది. కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా ? ఏమైనా చర్యలు చేపడుతుందా అని చర్చించుకుంటున్నారు. ఢిల్లీలో టీఆర్ఎస్ నిర్వహించిన మహాధర్నాలో సీఎం కేసీఆర్ ప్రసంగం అనంతరం కేంద్ర మంత్రి సుధాన్షు పాండే ప్రెస్ మీట్ నిర్వహించారు. ఒప్పందం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను మిగిలిన బియ్యాన్ని FCIకి ఇవ్వాల్సి ఉంటుందని, 2021-22 రబీ సీజన్ లో ధాన్యం సేకరణ ప్రతిపాదనను తెలంగాణ పంపలేదని వెల్లడించారు. ముడిబియ్యం సేకరణ ప్రతిపాదనల కోసం ఇంకా వేచి చూస్తున్నామన్నారు.

Read More : Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

ఇక సోమవారం ఢిల్లీలో దీక్ష చేసిన కేసీఆర్.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం తేల్చి చెప్పాలని.. మిగతా రాష్ట్రాల్లో మాదిరే తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికలు వస్తేనే ప్రధాని మోదీకి రైతులు గుర్తొస్తారని.. రైతులతో పెట్టుకున్నవారెవ్వరూ అధికారంలో లేరన్నారు కేసీఆర్. కేంద్రాన్ని గద్దె దించే సత్తా రైతులకు ఉందన్నారు కేసీఆర్‌. హస్తిన వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి కేసీఆర్. కేంద్రాన్ని నిలదీస్తే.. సీఎంలకు జైలుకు పంపుతామని బెదిరిస్తారని.. దమ్ముంటే రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ విషయంలోనే ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటూ కేంద్రమంత్రి పీయూష్​గోయల్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పీయూష్ గోయల్ కాదు.. పీయూష్​గోల్​మాల్ అంటూ సెటైర్లు వేశారు. డెడ్‌లైన్ ముగిసేలోపు కేంద్రం దిగి రాకుంటే.. భూకంపం సృష్టిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

Read More : KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

మరోవైపు.. అటు ధాన్యం కొనుగోలుపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా.. దిగి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న అంశాన్ని రైతులకు తెలియజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే కల్లాల దగ్గరకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలా? ఐకేపీ కేంద్రాలను మళ్లీ తెరిపించి కొనుగోలు చేయాలా అనే అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.