BRS Avirbhava Sabha : నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు

నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాని కార్యదర్శి డి.రాజా వస్తుండటంతో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది.

BRS Avirbhava Sabha : నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. హాజరుకానున్న ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు

BRS Avirbhava Sabha

BRS Avirbhava Sabha : నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం సిద్ధమైంది. ఖమ్మం నగరం గులాబీమయం అయింది. 100 ఎకరాల్లో్ బీఆర్ఎస్ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సభకు 5 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చేసుకున్నారు. ఆవిర్బావ సభలో కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్టీ ఆవిర్భావం అనంతరం నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే కావడంతో అందరిచూపులు ఈ సభ వైపే ఉన్నాయి. సభకు ఐదు లక్షల మంది వస్తారని సిద్ధం చేసిన మైదానంలో సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2001, మే 17న కరీంనగర్ లో్ టీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన సింహ గర్జన స్ఫూర్తితో ఖమ్మం సభను భారీ ఎత్తున జరిపేందుకు బీఆర్ఎస్ వర్గాలు సన్నద్ధమయ్యాయి.

పార్టీ జాతీయ ఎజెండాతోపాటు బీజేపీకి ప్రత్యామ్నాయంగా తమ పార్టీ ఎజెండాను కేసీఆర్ ఈ వేదికపై వెల్లడించనున్నారు. ఆరు రాష్ట్రాల పార్టీ శాఖలు, రైతు విభాగాలను కూడా ప్రకటించనున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాని కార్యదర్శి డి.రాజా వస్తుండటంతో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, కేరళ, పంజాబ్ సీఎంలు హైదరాబాద్ కు చేరుకున్నారు. వీరంతా రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. కర్నాటక సీఎం పాదయాత్రలో ఉండటంతో ఆయన సభకు రావడం లేదు.  బీఆర్ఎస్ ఆవిర్భావ సభను తొలుత ఢిల్లీ నిర్వహించాలని కేసీఆర్ భావించారు. నేతలతో చర్చల అనంతరం తెలంగాణ తొలి దశ ఉద్యమానికి పునాది వేసిన ఖమ్మంలో అయితే బాగుంటుందని నిర్ణయించారు.

Khammam BRS Meeting : 100 ఎకరాల్లో సభ, 448 ఎకరాల్లో పార్కింగ్, జర్మన్ టెక్నాలజీ.. బీఆర్ఎస్ మీటింగ్‌కు ఖమ్మంలో భారీ ఏర్పాట్లు

20 రోజుల క్రితం నిర్ణయం తీసుకోగా మంత్రి హరీష్ రావు పది రోజుల క్రితమే రంగంలోకి దిగారు. ఖమ్మంలోనే మకాం వేసి సభా స్థలి ఎంపిక నుంచి ప్రాంగణాన్ని పూర్తిగా తీర్చి దిద్దే వరకు స్వయంగా పర్యవేక్షించారు. మరోవైపు పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వర్, పలువురు ఎమ్మెల్సీలు, ఇతర ఖమ్మం నేతలు సభా ఏర్పాట్లలో ఉన్నారు. ఖమ్మ-వైరా రహదారిపై వెంకటాయిపాలెం సమీపంలో వంద ఎకరాల్లో సభను నిర్వహిస్తుండగా ప్రధాని వేదికను జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వేదికపై సీఎం కేసీఆర్ తోపాటు కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ మాన్ సింగ్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా చిత్ర పటాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై వీరితో పాటు ఖమ్మం జిల్లా నేతలకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా సుమారు 75 వేలకుపైగా కుర్చీలు సిద్దం చేశారు. ప్రధాన నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రాంగణంలో 50 ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఖమ్మం సభ ద్వారా బీజేపీయేతర పక్షాల ఐక్యత సంకేతాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పలు రాష్ట్రాలను సందర్శించి విపక్ష ప్రభుత్వాల సీఎంలు, నేతలతో భేటీ అయ్యారు. ఇతర రాష్ట్రాల సీఎంల ప్రసంగాల అనంతరం కేసీఆర్ తన సందేశం ఇవ్వనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యం, 75 ఏళ్ల భారతావని దుస్థితి, వనరుల నిరుపయోగం తదితర అంశాలపై ఆయన ప్రసంగించే అవకాశం ఉంది.  అనంతరం బీఆర్ఎస్ జాతీయ పార్టీ విధి విధాలను ప్రకటించనున్నారు.

BRS In AP : అమరావతిలో బీఆర్ఎస్ ఆఫీస్.. ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభం, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు

బీఆర్ఎస్ సభ సందర్భంగా ఖమ్మం మొత్తం గులాబీమయం అయింది. హైదరాబాద్ నుంచి ఉదయం రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో సీఎం కేసీఆర్ పాతు, మూడు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నేతలు మధ్యాహ్నం 1 గంటకు నూతన సమీకృత కలెక్టర్ భవన ప్రారంభోత్సవానికి ఖమ్మం చేరుకుంటారు. అక్కడే కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జాతీయ నేతల చేతుల మీదుగా ఆరుగురు లబ్ధిదారులకు కళ్ల జోడులు అందజేస్తారు. భోజనం అనంతరం భహిరంగ సభకు హాజరవుతారు. ఖమ్మ నగరం చుట్టూ ఐదు కిలో మీటర్ల వరకు గులాబీ తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్స్, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. బహింగ సభ కోసం బీఆర్ ఎస్ ముఖ్యనేతలు ఖమ్మం బాట పట్టారు.

మరోవైపు ఈ సభకు పెద్ద ఎత్తున జనం కూడా వస్తుండంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ హైదరాబాద్ కు చేరుకున్నారు. నేడు ప్రగతి భవన్ లో కేజ్రీవాల్, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్ బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై నలుగురు సీఎంలు చర్చించనున్నారు.  తొలుత నలుగురు సీఎంలు యాదగిరిగుట్టకు వెళ్లున్నారు. యాదగిరీశుడి దర్శనం తర్వాత ఖమ్మానికి పయనమవుతారు. ఖమ్మం నూతన కలెక్టరేట్ కు నేడు ప్రారంభోత్సవం జరుగనుంది. కంటి వెలుగు-2కు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం బహిరంగ సభలో నలుగురు సీఎంలు పాల్గొననున్నారు.