Yadadri : యాదాద్రికి సీఎం కేసీఆర్.. మార్చి 28న లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం

మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు

Yadadri : యాదాద్రికి సీఎం కేసీఆర్.. మార్చి 28న లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం

Kcr Yadadri

Telangana CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ మరోసారి యాదాద్రికి వెళ్లనున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మార్చి 28న యాదాద్రి సన్నిధిలో మహాకుంభ సంప్రోక్షణం జరగనుంది. 21 నుంచి మహా సుదర్శనయాగాన్ని నిర్వహించనున్నారు. దీంతో.. ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. 2022, ఫిబ్రవరి 07వ తేదీ సోమవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళతారు. యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసాయి. దీంతో.. పూర్తైన పనులను సీఎం పరిశీలించ‌నున్నారు. ఏరియల్‌ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ప్రధాన ఆలయం, క్యూలైన్లు, శివాలయం, పుష్కరిణిని పరిశీలించ‌నున్నారు. జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

Read More : Lata Mangeshkar : స్కూలుకే వెళ్లని లతా మంగేష్కర్.. ఎన్ని భాషలు వచ్చో తెలుసా?

రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి పునఃనిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. అనేక సార్లు యాదాద్రికి వెళ్లారు. ప్రతీ పనినీ స్వయంగా పర్యవేక్షించారు. ప్రతీ విషయంపైనా అధికారులకు సలహాలు సూచనలు చేశారు. వచ్చే నెలలో యాదాద్రి ఆలయ పునర్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ప్రధాని మోదీ సహా.. ఇతర ప్రముఖులను సీఎం కేసీఆర్ స్వయంగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో.. యాదాద్రికి తరలి వచ్చే వీవీఐపీల భద్రకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేస్తారు.

Read More : Statue of Equality : శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. ఆరో రోజు, దివ్య దేశాలకు ప్రాణప్రతిష్ట

2022 మార్చి 28 వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయ పునఃప్రారంభం కానున్నది. అంతకు 8రోజుల ముందునుంచి అంటే మార్చి 21వ తేదీ నుంచి 28 వ తేదీ వరకు అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పున: ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు, పీఠాధిపతులు యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై చర్చించనున్నారు సీఎం.~భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేసే అవకాశం ఉంది. ఆల‌య పున‌:ప్రారంభ సమ‌యంలో నిర్వహించే యాజ్ఞ, యాగాదుల గురించి.. చ‌ర్చించే అవకాశం ఉంది. 8 రోజుల ముందు నుంచి నిర్వహించే మహా సుదర్శన యాగంలో 10వేల మంది రుత్విజులు పాల్గొనున్నారు.