Telangana Govt : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా

రాకేశ్‌ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు.

Telangana Govt : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా

Rakesh

Telangana government : సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్‌ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం ప్రకటించింది. రాకేశ్‌ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. రాకేశ్‌ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలతో రాకేశ్‌ మృతి చెందాడని సంతాపం తెలిపారు.

తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. సికింద్రాబాద్‌ కాల్పుల ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పోలీస్‌ శాఖను ఆదేశించారు. ఇక రాకేశ్‌ అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాకేశ్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు.

Agnipath : ఆర్మీ జవాన్‌ కావాలని కలలుకన్న యువకుడు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో మృతి

రాకేశ్‌ స్వగ్రామం దబ్బీర్‌పేట గ్రామంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఉదయం 9 గంటలకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రాకేశ్‌ మృతదేహాన్ని తరలించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు దబ్బీర్‌పేట గ్రామానికి చేరుకుంటుంది. అనంతరం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు నర్సంపేట బంద్‌కు పిలుపునిచ్చారు.

రాకేశ్‌ మృతదేహం నిన్ననే వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. రాత్రి మార్చురీలో భద్రపరిచారు. ఇవాళ మృతదేహాన్ని ర్యాలీగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాకేశ్‌ మృతదేహానికి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితోపాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు నివాళులు అర్పించారు.